
సాక్షి, చెన్నై: నటి వనిత విజయ్‌కుమార్‌తో గొడవ పడి అరెస్టయిన మహిళకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో పోలీసులు వడపళని ఆందోళన చెందుతున్నారు. ఆ మహిళ పత్తా లేకుండా పోవడంతో తనిఖీలు చేస్తున్నారు. మూడో పెళ్లి చేసుకున్న సినీ నటి వనిత ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నిలిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోషల్ మీడియా వేదికగా వనితపై ఓ మహిళ తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వనిత చివరకు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో వడపళని పోలీసులు సదరు మహిళను గత వారం అరెస్టు చేశారు.
(నాగశౌర్య లుక్ అదుర్స్)
కోర్టులో హాజరు పరచగా, బెయిల్‌పై మహిళ బయటకు వచ్చేసింది. అయితే, అంతకుముందు సేకరించిన నమూనాల పరీక్షా ఫలితాల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ, ఆ మహిళ అడ్రెస్ మాత్రం చిక్కడం లేదు. ఆమెకు ఆస్పత్రికి, కోర్టుకు తీసుకెళ్లిన పాటు ఆస్పత్రికి వెళ్లిన వడపళని పోలీసులు కూడా వైద్య పరీక్ష చేసుకున్నారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఓ పోలీసుకు పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసుస్టేషన్‌లో విధుల్లో ఉన్న మిగతా సిబ్బంది కూడా కలవరానికి గురవుతున్నారు. నటి వనిత కూడా ఆ మహిళ స్టేషన్‌లో ఉన్న సమయంలో అక్కడకు వచ్చినట్టు సమాచారం.
(కోబ్రాలో విక్రమ్ గెటప్స్ ఎన్నో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment