అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన‌ టీమిండియా క్రికెట‌ర్  | Indian Women Cricketer VR Vanitha Announces Retirement At 31 | Sakshi
Sakshi News home page

VR Vanitha: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ టీమిండియా క్రికెట‌ర్ 

Published Mon, Feb 21 2022 8:24 PM | Last Updated on Mon, Feb 21 2022 9:47 PM

Indian Women Cricketer VR Vanitha Announces Retirement At 31 - Sakshi

VR Vanitha Announces Retirement: టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ వి ఆర్ వ‌నిత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ మేర‌కు త‌న నిర్ణ‌యాన్ని సోమ‌వారం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న‌ట్లు 31 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనింగ్ బ్యాట‌ర్‌ ప్ర‌క‌టించింది. టీమిండియాతో త‌న 12 ఏళ్ల ప్ర‌యాణాన్ని వ‌నిత త‌న ట్వీట్‌లో వివ‌రించింది. ఈ ప్ర‌యాణంలో త‌నకు స‌హ‌క‌రించిన వారంద‌రికీ ధ‌న్యావాదాలు తెలిపింది. దేశ‌వాళీ క్రికెట్‌లో కర్ణాట‌క‌, బెంగాల్ జ‌ట్ల‌కు ఆడిన వ‌నిత‌.. 2014 జ‌న‌వ‌రిలో భార‌త జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. అంత‌ర్జాతీయ కెరీర్‌లో 6 వ‌న్డేలు, 16 టీ20లు ఆడిన ఆమె.. ఓవ‌రాల్‌గా 300కు పైగా ప‌రుగులు సాధించింది.


చ‌ద‌వండి: ప్ర‌పంచ నం.1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు షాకిచ్చిన‌ 16 ఏళ్ల భార‌త కుర్రాడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement