‘నాకు చాలా ఈగో ఎక్కువ’ | Actor Vijay Sai wife Audio Clip | Sakshi

‘నాకు చాలా ఈగో ఎక్కువ’

Dec 15 2017 5:18 PM | Updated on Apr 3 2019 8:57 PM

Actor Vijay Sai wife Audio Clip - Sakshi

సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయ్‌కు అతడి భార్య వనిత పంపిన ఆడియో క్లిప్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది.

‘నాకు ఎంత ఈగో రేజ్‌ అవ్వాలి. విజయ్‌ నీకు అలాంటివేమి ఉండవనుకుంటాను. నాకు చాలా ఎక్కువ. ఒక్కసారి  నా ఈగో రెచ్చగొడితే  అది లైఫ్‌ లాంగ్‌  బ్లడ్‌లో ఉండిపోతుందంతే. నీకు తెలియదు కదా నా గురించి చూడు రివేంజ్ ఎలా ఉంటుందో. రివేంజ్ తీర్చుకోకుండా ఉండను. ఎందుకంటే నేను సైలెంట్‌గా ఉండను. నేను ఇంతవరకు ఎంత దిగజారానో నాకు తెలుసు. అర్థమైందా? నేను మళ్లీ ఎలా బతుకుతానో నువ్వు చూద్దువు కానీ. బాధ పడకు, కంగారు పడకు సరేనా?’ అంటూ వనిత మాట్లాడిన మాటలు ఆడియోలో ఉన్నాయి. కాగా, తన చావుకు వనిత, మరో ఇద్దరు కారణమని పేర్కొంటూ ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి సెల్ఫీ వీడియోలో పేర్కొన్న సంగతి తెలిసింది.

అజ్ఞాతంలోకి వనిత..?
వనితను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వనిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. తన కొడుకు మృతికి కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదని విజయ్‌ తండ్రి సుబ్బారావు ప్రశ్నిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement