తూర్పు గోదావరి, సాక్షి: మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఏపీ ముక్తకంఠంతో చెబుతోంది. ఆ పిలుపు కూటమి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రజాదరణను భరించలేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సాక్షాత్తూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపైన దాడికి టీడీపీ శ్రేణులు యత్నించారు.
మంగళవారం అర్ధరాత్రి గోపాలపురం నల్లజర్లలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. హోం మంత్రి తానేటి వనిత స్థానికంగా ప్రచారం ముగించుకుని ఎక్స్ జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. YSRCP ప్రచార వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో గొడవకు దిగాయి. ఈలోపు టీడీపీ కార్యకర్తల్లో కొందరు తానేటి వనిత పైకి దూసుకెళ్లే యత్నం చేశారు.
అయితే అప్రమత్తమైన ఆమె భద్రతా సిబ్బంది ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి భద్రత కల్పించారు. అయినా ఆగకుండా సుబ్రహ్మణ్యం ఇంటి ఫర్నీచర్‌ను, అక్కడున్న మరికొన్ని వాహనాల్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. వాళ్లనూ తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు దాడికి యత్నించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యాయి.
శాంతి భద్రతలను పర్యవేక్షించే హోం మంత్రిపై దాడికి యత్నించడాన్ని వైఎస్సార్‌సీపీ ముక్తకంఠంతో ఖండిస్తోంది.
విషయం తెలిసిన ఎస్పీ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చిన పోలీసులు.. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నల్లజర్లలో భారీగా మోహరించారు.
హోం మంత్రి స్పందన
టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, పైగా మహిళ అని కూడా చూడకుండా తనపై దాడికి యత్నించారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ‘‘హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment