పల్నాడులో మళ్లీ పచ్చ మూకల అరాచకం | TDP Leaders Attack On YCP Leader Eda Sambireddy | Sakshi
Sakshi News home page

కారు అడ్డుపెట్టి.. హత్యాయత్నానికి తెగబడి

Published Wed, Jul 24 2024 5:14 AM | Last Updated on Wed, Jul 24 2024 8:01 AM

TDP Leaders Attack On YCP Leader Eda Sambireddy

సినీ ఫక్కీలో వైఎస్సార్‌సీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై దాడి, కాళ్లకు తీవ్రగాయాలు

గాయపడ్డ ఇద్దరు అనుచరులు, డ్రైవర్‌

పల్నాడు జిల్లాలో దారుణం

పెదకూరపాడు/నగరంపాలెం: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీని­వాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం.

సాంబి­రెడ్డికి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్‌ యార్డు చైర్మ­న్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్ని­కలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెద­కూర­పాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పెదకూరపాడు ఇన్‌చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాల­యా­నికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచ­రులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్‌ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు.

తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూర­పాడు మండ­లం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణి­స్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మ­డిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారు­ల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారు­కు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొ­ట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోద­ర్‌­రెడ్డి, గంగాధర­రెడ్డికి గాయాల­య్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్ష­ణారహితంగా పది మంది దాడి చేశారు.

ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమ­య­ంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ భార్య లావణ్య) కారునే అడ్డు­కు­ంటారా అంటూ దాడి చేసినట్లు బాధి­తులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాస­రావు పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి వివ­రాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దారుణం
తెల్లారక ముందే.. దుకాణాలు కూల్చేశారు!
విజయవాడ బుడమేరు వంతెన సెంటర్‌లో ఘటన.. లబోదిబోమంటున్న బాధితులు
మధురానగర్‌ (విజయవాడసెంట్రల్‌): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటినుంచి పేదోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నడి»ొడ్డునున్న బుడమేరు సెంటర్‌లోని చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం తెల్లవారుజామున కూలి్చవేయడంతో వారంతా నడిరోడ్డున పడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ బతుకుపై దెబ్బకొట్టారని వారు లబోదిబోమంటూ రోడ్డెక్కి నిరసనకు దిగారు.

వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని బుడమేరు వంతెన సెంటర్‌లో పలువురు చిరువ్యాపారాలు సాగిస్తూ 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులు కావడంతో పది రోజుల క్రితం దుకాణాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమను కలిసి గోడు విన్నవించుకోగా.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పి పంపించి వేశారు. దీంతో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ టౌన్‌ఫ్లానింగ్‌ అధికారులు, పోలీసుల సహకారంతో దుకాణాలను కూలి్చవేశారు. సమాచారం తెలుసుకున్న దుకాణదారులు లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 ఏళ్లుగా దుకాణాలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాలు తొలగిస్తే.. ఎక్కడకు వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలు కూలి్చవేశారని, తమకు పునరావాసం కలి్పంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దుర్మార్గం
శిలాఫలకంలోని చిత్రాలను పగులకొట్టారు
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివా­లయ భవనం శిలాఫల­కాన్ని పచ్చ మూకలు సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్‌ల ఫొటోలను ఏర్పాటు చేశారు.

పచ్చ­మూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్‌ జగన్, మేకా ప్రతాప్‌ ఫొటోలను పలుగులతో పగుల­గొట్టారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివా­లయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. – నూజివీడు

దాష్టీకం అభాగ్యురాలి జీవితం చిదిమేశారు
విశాఖలో యువతిపై అత్యాచారం
కేజీహెచ్‌కు బాధితురాలు తరలింపు
గోప్యంగా ఉంచుతున్న పోలీసులు
కొద్ది రోజుల క్రితమే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
ఆ ఘటన మరువకముందే మరో దారుణం

మధురవాడ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మధురవాడలో కొద్ది రోజుల కిందట ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మూకలు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ ఘటన విశాఖ నార్త్‌ సబ్‌ డివిజన్‌ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధి కొమ్మాది జంక్షన్‌ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువతి చోడవరం ప్రాంతం నుంచి వచ్చి కొమ్మాది జంక్షన్‌ వద్ద ఉన్న ఒక బేకరీలో పనిచేస్తోంది.

ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెపై బేకరీ–హాస్టల్‌కి మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. రాత్రి ఒంటి గంట సమయంలో బాధితురాలు హాస్టల్‌కి వెళ్లింది. కాసేపటికే వాంతి చేసుకుంది. హాస్టల్‌ వార్డెన్‌ పరిశీలించగా యువతి చెంపపై గాయం కూడా కనిపించింది.

దీంతో అనుమానం వచ్చిన వార్డెన్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే పీఎం పాలెం పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పక్కనే ఉన్న గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అయితే బాధితురాలితో మాట్లాడేందుకు ఎవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ దారుణ ఘటనపై విశాఖ పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయమై నార్త్‌ జోన్‌ ఏసీపీ సునీల్‌ను వివరణ కోరగా అత్యాచారం లాంటిది ఏమీ లేదన్నారు. యువతికి చిన్న దెబ్బలు తగిలాయని.. విచారణ చేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement