sambireddy
-
ఏపీలో ఆగని టీడీపీ శ్రేణుల దాడులు
-
వైఎస్ఆర్ సీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై ఇనుపరాడ్లతో టీడీపీ శ్రేణుల దాడి
-
పల్నాడులో టీడీపీ నేతల అరాచకం
-
వైసీపీ నేతను ఇనుపరాడ్లతో కొట్టిన టీడీపీ నేతలు
-
పల్నాడులో మళ్లీ పచ్చ మూకల అరాచకం
పెదకూరపాడు/నగరంపాలెం: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం.సాంబిరెడ్డికి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డు చైర్మన్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పెదకూరపాడు ఇన్చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచరులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు.తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూరపాడు మండలం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారుల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి, గంగాధరరెడ్డికి గాయాలయ్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా పది మంది దాడి చేశారు.ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య) కారునే అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దారుణంతెల్లారక ముందే.. దుకాణాలు కూల్చేశారు!విజయవాడ బుడమేరు వంతెన సెంటర్లో ఘటన.. లబోదిబోమంటున్న బాధితులుమధురానగర్ (విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటినుంచి పేదోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నడి»ొడ్డునున్న బుడమేరు సెంటర్లోని చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం తెల్లవారుజామున కూలి్చవేయడంతో వారంతా నడిరోడ్డున పడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ బతుకుపై దెబ్బకొట్టారని వారు లబోదిబోమంటూ రోడ్డెక్కి నిరసనకు దిగారు.వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బుడమేరు వంతెన సెంటర్లో పలువురు చిరువ్యాపారాలు సాగిస్తూ 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో పది రోజుల క్రితం దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమను కలిసి గోడు విన్నవించుకోగా.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పి పంపించి వేశారు. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో దుకాణాలను కూలి్చవేశారు. సమాచారం తెలుసుకున్న దుకాణదారులు లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 ఏళ్లుగా దుకాణాలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాలు తొలగిస్తే.. ఎక్కడకు వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలు కూలి్చవేశారని, తమకు పునరావాసం కలి్పంచాలని డిమాండ్ చేస్తున్నారు.దుర్మార్గంశిలాఫలకంలోని చిత్రాలను పగులకొట్టారు⇒ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని పచ్చ మూకలు సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్ల ఫొటోలను ఏర్పాటు చేశారు.పచ్చమూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకా ప్రతాప్ ఫొటోలను పలుగులతో పగులగొట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివాలయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. – నూజివీడుదాష్టీకం అభాగ్యురాలి జీవితం చిదిమేశారు⇒ విశాఖలో యువతిపై అత్యాచారం⇒ కేజీహెచ్‌కు బాధితురాలు తరలింపు⇒ గోప్యంగా ఉంచుతున్న పోలీసులు⇒ కొద్ది రోజుల క్రితమే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి⇒ ఆ ఘటన మరువకముందే మరో దారుణంమధురవాడ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మధురవాడలో కొద్ది రోజుల కిందట ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మూకలు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ ఘటన విశాఖ నార్త్ సబ్ డివిజన్ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి కొమ్మాది జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువతి చోడవరం ప్రాంతం నుంచి వచ్చి కొమ్మాది జంక్షన్ వద్ద ఉన్న ఒక బేకరీలో పనిచేస్తోంది.ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెపై బేకరీ–హాస్టల్‌కి మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. రాత్రి ఒంటి గంట సమయంలో బాధితురాలు హాస్టల్‌కి వెళ్లింది. కాసేపటికే వాంతి చేసుకుంది. హాస్టల్ వార్డెన్ పరిశీలించగా యువతి చెంపపై గాయం కూడా కనిపించింది.దీంతో అనుమానం వచ్చిన వార్డెన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే పీఎం పాలెం పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పక్కనే ఉన్న గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అయితే బాధితురాలితో మాట్లాడేందుకు ఎవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ దారుణ ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయమై నార్త్ జోన్ ఏసీపీ సునీల్‌ను వివరణ కోరగా అత్యాచారం లాంటిది ఏమీ లేదన్నారు. యువతికి చిన్న దెబ్బలు తగిలాయని.. విచారణ చేస్తున్నామని తెలిపారు. -
శెహభాష్ సాంబిరెడ్డి
వంగా సాంబిరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం. కూరగాయల దగ్గర్నుంచి బియ్యం, పసుపు, కందుల వరకు ఇంటికి అవసరమైన చాలా రకాల ఆహార పంటలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో ఏ రోజైనా మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా రైతు ధరకే తీసుకెళుతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల నుంచి వ్యాపారులు చేను వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి పుట్టెడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగంలో ఈ రైతు సాధించిన విజయం అద్భుతం. అదెలాగో ఆయన మాటల్లోనే... బీటెక్ చదివి ఎంబెడెడ్ ఇంజనీరుగా చెన్నైలో మూడు దశాబ్దాలు సాఫ్ట్వేర్ సంస్థను నడిపాను. స్వస్థలం వల్లభాపురంలో పెద్దల్నుంచి వచ్చిన భూమి కౌలుకిస్తే ఫలసాయం పెద్దగా లేకపోగా, రసాయనాల వాడకంతో ఏటికేడాది సారం తగ్గిపోతోంది. బాధనిపించింది. కంపెనీని కుటుంబసభ్యుల కప్పగించి వచ్చేశాను. భూమి ఆరోగ్యం మెరుగుపడితేనే ఏదైనా సాధించగలం అనిపించింది. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాను. ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయ సూత్రాలను అధ్యయనం చేస్తూ, సాగుకు ఉప్రకమించాను. అయిదేళ్లుగా కష్టనష్టాలకోర్చి చేసిన వ్యవసాయానికి తగ్గ ఫలితాలను ఏడాదిగా చవిచూస్తున్నా.. సహజసిద్ధంగా పంటల సాగు... టూత్‌పేస్ట్‌తో సహా తయారీ రంగంలోని ఏ వస్తువుకైనా గరిష్ట చిల్లర ధర(ఎంఆర్పీ)ను ఆయా కంపెనీలే నిర్ణయిస్తున్నపుడు.. పండించిన పంట ధరను నిర్ణయించటానికి రైతులకు అవకాశం ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న నా మనసును వేధిస్తుండేది. ఆరోగ్యకరంగా పండించిన నాణ్యత కలిగిన పంటను తీసుకురాగలిగితే, అమ్మకానికి ఢోకా ఉండదు, పైపెచ్చు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుందని భావించాను. ఇందుకు ప్రకృతి వ్యవసాయం భేషైన పరిష్కారంగా తోచింది. చిక్కుడు పొలంలో సాంబిరెడ్డి మాకున్న 30 ఎకరాల పొలంలో బిందు సేద్య పద్ధతిలో నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల సాగుకు ఐదేళ్ల క్రితం ఉప్రకమించాను. రసాయనాల ప్రభావం తగ్గిపోయి, భూమి పూర్తిస్థాయి సహజ స్వభావాన్ని సంతరించుకోవటానికి నాలుగేళ్లు పట్టింది. తెగుళ్లు, పురుగు రాకుండా భూమి నిరోధకశక్తి పెరిగింది. ఏడాది నుంచి గుంటూరు, విజయవాడ, మంగళగిరి, కుంచనపల్లి నుంచి వ్యాపారులు మా పొలం దగ్గరకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలేవైనా కిలో ధర రూ. 30..ఏడాది మొత్తం ఒకటే ధర మరో ఆరు ఎకరాలు తీసుకుని మొత్తం 36 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. పోషకాలు ఎక్కువగా ఉండే బ్లాక్ రైస్, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే రకం ఆర్ఎన్ఆర్ 15048, సన్నాలు (005), ప్రగతి రకం (కుర్కుమిన్ 4.62 శాతం) పసుపు, మినుములు, పెసలు, కందులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, శెనగ, ఉలవలు సాగు చేస్తున్నాను. వీటికి తోడు బొప్పాయి, కూర అరటి, దానిమ్మ సాగు చేయబోతున్నాను. సీజనువారీగా చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాను. ప్రస్తుతం వంకాయ, టొమాటో, గోరుచిక్కుడు, పచ్చిమిర్చి, పండుమిర్చి, కాప్సికం, బీట్రూట్, క్యారట్, ముల్లంగి, దోస, సొరకాయ ఉన్నాయి. తర్వాతి సీజనులో బీర, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వేస్తాం. ఏ కూరగాయ అయినా కిలో రూ.30 ధర నిర్ణయించాను. మార్కెట్లో కిలో రూ.10 అయినా, రూ.60కి పెరిగినా నా ధరలో మార్పుండదు. పండించే పంటకు కనీస ధర ఎంతన్నది ముందు తెలిస్తే భరోసా ఉంటుంది కదా! ఎర పంటలతో సమగ్ర సస్య రక్షణ.. మన భూమి ఎంత ఆర్గానిక్ అయినా పరిసరాల్లోని పొలాల్లోంచి తెగుళ్లు, పురుగు వచ్చే అవకాశం ఉంది. సమగ్ర సస్య రక్షణ చేస్తున్నాం. క్యాబేజి, కాలీఫ్లవర్‌ను ఆశించే పురుగులను ఆకర్షించేందుకు చేను మధ్యలో అక్కడక్కడా ఆవాలు పంట వేస్తున్నా. వాటికి ఆహారంగా ఆవాలు పంటను ఇచ్చి, ప్రధాన పైరును నిరపాయకరంగా తీసుకుంటున్నా. తులసి, కొత్తిమీర, సోంపు, జీలకర్ర, వాము వంటి మొక్కలు తమ వాసనతో పురుగులను నిరోధిస్తాయి. ఇవి పంట నివ్వటమే కాదు, ఇతర పంటల రక్షణకు ఉపయోగపడుతున్నాయి. అలాగే ఎర పంటలు... టొమాటోకు బంతి, వంగకు బెండ.. ఇలా ఒక్కో పంటకు ఒక్కో ఎర పంటను ఉంచుతూ పంట సరిహద్దుల్లో ప్రధాన పైరుకన్నా ఎక్కువ ఎత్తులో ఉండే జొన్న/ మొక్కజొన్న, మొత్తం చేను చుట్టూ అవిశె తోటను పెంచుతూ వస్తున్నా. మిత్ర, శత్రు పురుగులనూ పట్టించుకుంటున్నా. శత్రు పురుగులను అశక్తులను చేసేందుకు పసుపు, నీలిరంగు, నీటిరంగు తరహాలో రకరకాల ట్రాప్స్‌ను చేలో వాడుతున్నాం. మిత్ర పురుగులకు పొలంలో చోటు కల్పిస్తున్నాం. పంటను దెబ్బతీసే శత్రు పురుగుల గుడ్లను ఇవి ఆహారంగా తీసుకుంటూ పంటకు రక్షణ కల్పిస్తుంటాయి. భూమి ఉత్పత్తి శక్తిని పెంచేందుకు... భూమి ఉత్పత్తి శక్తిని పెంచుకొనేందుకు బాక్టీరియా, సేంద్రియ ఎరువు, పొలం వ్యర్ధాలు (కంది పొట్టు, మినప పొట్టు, కాల్చని చెత్తయినా సరే), ఫ్యాక్టరీ వ్యర్ధాలు (వేరుశెనగ పొట్టు, నూనె తీసిన నువ్వుల చెక్క, చెరకు పిప్పిని రెండేళ్లకోసారి వేస్తున్నాం. కానుగ పిండి, వేప పిండి, విప్ప పిండి, ఆముదం పిండిని వాడుతున్నాం. ఉదజని సూచిక(పీహెచ్) స్థాయి, పోషకాలను పరిశీలించుకుని పైన చెప్పిన వాటిలో తగినవి భూమిలో దున్నేశాం. ఆ విధంగా భూమిని ‘సకల పోషకాల గని’గా చేసుకోగలిగాం. బిందు సేద్యంతో ప్రతి మొక్కకు పోషకాలు అందేలా చూస్తున్నాం. ఇందుకు బాక్టీరియా తోడ్పడుతోంది. వచ్చే ఏడాది వరి సాగుకు బిందు విధానం వాడదలిచాను. పసుపులో 4.62% కుర్కుమిన్‌తో విప్లవం కీలకమైన పసుపు పంటను ఏటా సాగు చేస్తూ 50 శాతం విత్తనాభివృద్ధికి వినియోగిస్తున్నా. ఈసారి 8 ఎకరాల విస్తీర్ణంలో వేశా. దున్నటం అయిపోయింది. ప్రగతి రకంలో 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. 4.62 శాతం కుర్కుమిన్ సాధిస్తున్నా. గతేడాది నంద్యాల, విశాఖ ఉద్యాన శాఖల అధికారులు తీసుకెళ్లారు. సాధారణంగా పసుపు వేసిన చేలో పోషకాలు సరిపోవని మరుసటి సంవత్సరం మళ్లీ పసుపు వేయరు. మేం వాడే విత్తనంతో డిసెంబరులో పంట తీసి, జనవరిలో మిర్చి, టొమాటో, వంగ వేశాం. వీటి తర్వాత జూన్‌లో మళ్లీ పసుపు సాగు చేయబోతున్నా. పసుపును వండకుండా, రెండేళ్లుగా నిల్వ చేయడంలోనూ సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నా. సాంబిరెడ్డి పొలంలో పసుపు కొమ్ముల గ్రేడింగ్ పచ్చి పసుపు వినియోగంపై ప్రచారం... పసుపు పంటను ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టగా వచ్చిన కొమ్ముల నుంచి తీసిన పసుపు పొడిని ఇళ్లలో వినియోగిస్తుండటం సాధారణంగా జరుగుతుంది. ఇందుకు బదులుగా అల్లం పేస్ట్‌లాగా పచ్చి పసుపును కచ్చాపచ్చాగ నూరి కూరల్లో వాడుకొంటే పసుపు ప్రయోజనం పూర్తిగా అందుతుంది. దీనినే ప్రచారం చేస్తూ ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకం కేంద్రాలకు శాంపిల్‌గా కొన్ని కిలోలు పంపా. అనుకున్నట్టే ఆదరణ బాగా ఉంది. కిలో రూ.50కి నేను ఇస్తుంటే రూ.80 నుంచి రూ.160లకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటం విజయానికి నిదర్శనం.. (సాంబిరెడ్డిని 97044 13596 నంబరులో సంప్రదించవచ్చు) సాంబిరెడ్డి తోటలో టొమాటోలు పండుతాయి. తను మార్కెట్‌కు వెళ్లడు. మార్కెట్ తన దగ్గరకు వస్తుంది. తన తోటలో గట్టుమీద కిలోకు 30 రూపాయలు ఇచ్చిపోతున్నారు. టొమాటో కుళ్లిపోయిందని రైతుని పీడించే కుళ్లిపోయిన మార్కెట్ వ్యవస్థను జయించిన మన సూపర్ హీరో రైతు సాంబిరెడ్డి రైతులందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. టొమాటో ఒక్కటే కాదు. చాలా రకాల కూరగాయలు పండిస్తున్నాడు. పంట ఏదైనా ఆయన చెప్పిందే ధర. అదే ఫైనల్. ప్రకృతి వ్యవసాయదారుడు సాంబిరెడ్డి వల్ల రైతుకు, వ్యవసాయానికి, దిగుబడికి డబ్బే కాదు.. గౌరవం దక్కింది. శెహభాష్ సాంబిరెడ్డి. ఈ పచ్చటి కథ మీదాకా తేవడానికి ‘సాక్షి’ కూడా చాలా గర్వపడుతోంది. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలొదిలాడు
ములుగు: ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతంతో స్తంభంపైనే మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కంది సాంబిరెడ్డి(55)కు ఎకరంన్నర పొలం ఉంది. నీళ్లు పడక పంట ఎండిపోయింది. నీళ్ల కోసం పనిచేయని ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేసేందకు స్తంభంపైకి ఎక్కి వైర్లు సరిచేస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం అవ్వడంతో సాంబిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఈయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. -
‘ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టొద్దు’
-
చొక్కా పట్టుకు లాక్కెళ్లారు...
హైదరాబాద్ : భూములు ఇవ్వని రైతులపై తీవ్రమైన ఒత్తిడులు వస్తున్నాయని ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల దుశ్చర్య, వేధింపులపై ...రైతులు సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెలిబుచ్చారు. ఊర్లలో పోలీసులు తిరగడం విపరీతమైందని, ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నారు. పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమకు ఉండే అర ఎకరం పొలంలో పంటలు పండించి జీవనం సాగించే తమ దగ్గర భూములను లాక్కోవటం సరికాదన్నారు. తాము భూములు ఇచ్చేది లేదని రాజధాని ప్రాంత రైతులు తెగేసి చెప్పారు. ఉండవల్లికి చెందిన సాంబిరెడ్డి అనే రైతు మాట్లాడుతూ తమ పంటలను దుండగులు తగలబెడితే...దాన్ని కూడా వ్యవసాయ మంత్రి ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించారన్నారు. కనీసం గ్రామంలో అడుగు పెట్టకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎలా చెబుతారని ప్రశ్నించినందుకు తనపై కక్ష కట్టారన్నారు. మంత్రిని అడ్డుకున్నందుకు ...ఇంటి బయట అరుగుమీద కూర్చున్న తనను చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారని సాంబిరెడ్డి తెలిపాడు. మంత్రిని అడ్డుకుని, ప్రశ్నించినందుకే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. మంగళగిరికి చెందిన మరో మహిళా రైతు ఉషారాణి మాట్లాడుతూ తమ భూముల్ని ఇచ్చేస్తే ఎలా బతికేదని...ప్రశ్నిస్తున్నందుకు తమ కుటుంబసభ్యుల్ని పోలీసులు తీసుకు వెళ్లి వేధిస్తున్నారని, తమవారిని విడుదల చేయాలని ధర్నా చేస్తే.. అప్పుడు విడుదల చేస్తున్నారని తెలిపారు. తాము చేసిన తప్పేంటి అని ఆమె ప్రశ్నించారు.