ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలొదిలాడు
Published Sat, Sep 2 2017 2:03 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ములుగు: ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతంతో స్తంభంపైనే మృతి చెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం బండారుపల్లిలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కంది సాంబిరెడ్డి(55)కు ఎకరంన్నర పొలం ఉంది. నీళ్లు పడక పంట ఎండిపోయింది.
నీళ్ల కోసం పనిచేయని ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేసేందకు స్తంభంపైకి ఎక్కి వైర్లు సరిచేస్తున్న సమయంలో విద్యుత్ ప్రసారం అవ్వడంతో సాంబిరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఈయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.
Advertisement
Advertisement