పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు
పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు
Published Fri, Sep 16 2016 9:09 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– మోటారు ఆన్‌చేస్తూ విద్యుత్‌షాక్ తో మృతి
– కొక్కిలిగడ్డలో విషాదం
– మృతుడు టీడీపీ గ్రామ అధ్యక్షుడు
కొక్కిలిగడ్డ (మోపిదేవి):
పొలానికెళ్లిన రైతు విద్యుతాఘాతంతో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి Ðð ళ్తే... మండల పరిధిలోని కొక్కిలిగడ్డ గ్రామంలో రైతు, టీడీపీ నాయకుడు కేసాని శరాబంద్ (65) ఉదయం 11 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వర్షాలు లేక నానా అవస్థలు పడుతున్న రైతు ఉదయం త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడంతో మోటార్ వేసేందుకు సమీపంలోని పొలానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. సమీపంలోని రైతులు, గ్రామస్థులు వచ్చేసరికి విగతజీవిగా మారాడు. సమాచారాన్ని విద్యుత్‌శాఖ ఏఈ, రెవెన్యూ అధికారులకు తెలియచేశారు. అధికారులు వచ్చిన తరువాత మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్థానిక ప్రముఖుల నివాళి
ఈయన సొంత భూమితో పాటు కౌలు భూమి తీసుకుని వ్యవసాయం చేసేవారు. మృతునికి భార్య ఇందిర, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శరాబంద్ టీడీపీ ప్రారంభం నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేశారు. మోపిదేవి మండల పరిషత్ ఏర్పడిన తొలినాళ్లలో మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు, ప్రస్తుతం గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా కొసాగుతున్నారు. భౌతికకాయాన్ని టీడీపీ జిల్లా కార్యదర్శి కంఠంనేని శివశంకర్, తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠంనేని రవిశంకర్, పెదప్రోలు, బొబ్బర్లంక, నాగాయితిప్ప పీఏసీఎస్ అధ్యక్షులు నాదెళ్ల శరత్‌శ్చంద్రబాబు(బుజ్జి), కోనేరు నాగేశ్వరావు, మురాల సుబ్బారావు, వైఎస్సార్‌సీసీ గ్రామ కన్వీనర్ రాయన సత్యనారాయణ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.
Advertisement