
సాక్షి, నిర్మల్: వరుణుడి నుంచి పంటను కాపాడుకునేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన రాములు (55), మురళి... పొలంలోని సోయా పంట వర్షానికి తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లారు. అయితే పంట చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడంతో... ప్లాస్టిక్ కవర్ ఆ తీగలకు తగిలింది. దీంతో తండ్రీకొడుకులకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (మం) సుద్దాల గ్రామంలో ఎయిర్ టెల్ టవర్‌లో పనిచేస్తున్న తిరుపతి అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. మృతుడు నారాయణ పేట జిల్లా కుంసనపల్లి గ్రామవాసి.
Comments
Please login to add a commentAdd a comment