Man touches high-tension wire at Secunderabad, died on spot - Sakshi
Sakshi News home page

మార్నింగ్‌ వాక్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే వ్యక్తి మృతి

Published Fri, Mar 17 2023 11:31 AM | Last Updated on Fri, Mar 17 2023 4:22 PM

Hyderabad: Man Touches High-tension Wire At Secunderabad, Dies At Spot - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వర్షాల దెబ్బకు తెగిప‌డ్డ ఓ విద్యుత్ వైరుపై కాలుపై అడుగువేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘ‌ట‌న సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్శిగుట్టలో నివాసం ఉండే ఏ. ప్రవీణ్ ముదిరాజ్ అనే వ్య‌క్తికి ప్ర‌తి రోజూలానే ఈరోజు(శుక్ర‌వారం) ఉద‌యం కూడా సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లోని పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లాడు. న‌గ‌రంలో కురుస్తున్న వ‌ర్షాల కారణంగా ఓ విద్యుత్ వైర్ తెగి నేల‌పై ప‌డింది.

అయితే అది గ‌మ‌నించ‌ని ప్ర‌వీణ్.. దానిపై అడుగువేయ‌డంతో విద్యుత్ షాక్‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. పార్క్‌కు వచ్చిన కొందరు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న  చిలకలగూడ పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement