hi tension
-
హరీశ్‌రావు.. నాపై పోటీ చేయి: మైనంపల్లి సవాల్
సాక్షి,సిద్దిపేటజిల్లా: సిద్దిపేట పట్టణంలో మంగళవారం(ఆగస్టు20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ర్యాలీలతో పట్టణంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పట్టణంలో మంగళవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ర్యాలీలకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తరలి వెళుతున్నారు. దీంతో వీరిరువురి మధ్య ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.‘మేం ధ్వజం ఎత్తాలనుకుంటోంది బీఆర్ఎస్పైన.. హరీష్ రావుపైనో ప్రజలపైనో కాదు. ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మేం ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నాం.వారు రేపు కూడా రైతు రుణమాఫీ ర్యాలీ చేసుకోవచ్చు. కానీ, మా ర్యాలీ అడ్డుకునేందుకే పోటాపోటీ ర్యాలీ పెట్టి ఉద్రిక్తతలు పుట్టిస్తున్నారు. వాళ్ల అంతు చూసేదాకా వదలబోం. రుణమాఫీ చేసినందున హరీశ్‌రావు మళ్లీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఇద్దరం మళ్లీ పోటీ చేద్దాం. హరీశ్ మళ్లీ గెలిస్తే నేను రాజకీయాల్లో నుంచి వెళ్లిపోతా’అని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. అయితే రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ర్యాలీకి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. తాము కూడా ర్యాలీ చేసి తీరుతామని బీఆర్ఎస్ శ్రేణులు తెగేసి చెబుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. -
ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 12) ఒక అడ్వైజరీ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణాన్నైనా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారత్ తన పౌరులను అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఉన్న భారతీయలు అక్కడున్న భారత రాయబార కార్యాలయాలను సంప్రదించాలని కోరింది. రెండు దేశాల్లో ఉన్న భారత పౌరులు తమ భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే బయట తిరగాలని సూచించింది. డజన్ల కొద్దీ క్రూయిజ్ మిసైళ్లు, వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్, ఇజ్రాయెల్‌పై విరుచుకుపడే అవకాశాలున్నాయని మీడియా కథనాలు వెలువడుతుండటం ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ ఆర్మీ టాప్ కమాండర్‌తో పాటు మొత్తం ఏడుగురు అధికారులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేయక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అనవసర ప్రయాణాలు చేయవద్దని ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమెరికన్ ఎంబసీ తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కోరింది. ఇదీ చదవండి.. ఇజ్రాయెల్‌కు టెన్షన్.. ఇరాన్ సంచలన ప్రకటన -
మార్నింగ్ వాక్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్: వర్షాల దెబ్బకు తెగిపడ్డ ఓ విద్యుత్ వైరుపై కాలుపై అడుగువేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్శిగుట్టలో నివాసం ఉండే ఏ. ప్రవీణ్ ముదిరాజ్ అనే వ్యక్తికి ప్రతి రోజూలానే ఈరోజు(శుక్రవారం) ఉదయం కూడా సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లాడు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఓ విద్యుత్ వైర్ తెగి నేలపై పడింది. అయితే అది గమనించని ప్రవీణ్.. దానిపై అడుగువేయడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పార్క్‌కు వచ్చిన కొందరు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
తాడిపత్రితో ఉద్రికత్త పరిస్థితి
-
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో వినాయక నిమజ్జనం సందర్బంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్ల దాడులు, వాహనాల దహనాలతో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో శనివారం వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించారు.చిన్నపొలమడలోని శ్రీప్రబోధానందాశ్రమం మీదుగా జేసీ సోదరుల అనుచరులు మూడు ట్రాక్టర్లలో ఊరేగింపు నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ, డప్పులు మోగిస్తూ, ఈలలు కేకలు వేయడంతో ఆశ్రమ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఇలా హంగామా సృష్టించడం సమంజసం కాదన్నారు. అక్కడ బందోబస్తులో ఉన్న సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి ఆశ్రమ భక్తులకు సర్దిచెప్పారు. అయితే, నిమజ్జనం ఊరేగింపు ఆశ్రమం ముందుకు రాగానే అధికార టీడీపీ కార్యకర్తలు, జేసీ సోదరుల అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఇంతలో అక్కడున్న మూడు ట్రాక్టర్లు, ఒక ఆటోకు మంటలంటుకున్నాయి. ఆశ్రమ భక్తులు, జేసీ అనుచరుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. ఈ ఘర్షణలో ఆశ్రమానికి చెందిన భక్తులు చంద్రశేఖర్, ఆదినారాయణ, జయచంద్ర, రామకృష్ణ, మహేష్, వెంకటేష్, నిరంజన్‌తోపాటు మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను ఆశ్రమ నిర్వాహకులు చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు జేసీ సోదరుల అనుచరులు పెద్దపొలమడలోని ఆశ్రమ భక్తుల నివాసాలను చుట్టుముట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ శనివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చేంత వరకు వాహనాలు దహనమవుతూనే ఉన్నాయి. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు మంటలను ఆదుపులోకి తెచ్చారు. అనుమతి ఎందుకు ఇచ్చినట్లు? శ్రీప్రబోధానందాశ్రమం ముందుగా ట్రాక్టర్లు ఊరేగింపుగా వెళ్లేందుకు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ దారిలో ఊరేగింపుగా వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇక్కడ నీళ్లు కూడా లేవు. అలాంటప్పుడు పోలీసులు ఆశ్రమం ముందు నుంచి ఊరేగింపునకు ఎందుకు అనుమతిచ్చారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనూ వినాయక చవితి సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులకు, జేసీ అనుచరులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయినా జేసీ వర్గీయులు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం. పథకం ప్రకారమే ఆశ్రమంపై దాడులు పెద్దపొలమడ, చిన్నపొలమడ గ్రామస్థులు తమ ఊళ్లలోనే వినాయక నిమజ్జనం నిర్వహించడం ఏటా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే, ఈసారి నిమజ్జనం సందర్భంగా చిన్నపాటి విగ్రహాలను ఓ ట్రాక్టర్లో ఉంచి, దాని వెనుక మరో రెండు ఖాళీ ట్రాక్టర్లకు పోలీసులు ఎందుకు అనుమతిచ్చారని ఆశ్రమ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఘర్షణ చోటు చేసుకోవడానికి కారణం సీఐ సురేంద్రనాథ్రెడ్డేనని ఆరోపిస్తున్నారు. సీఐ ప్రోత్సాహంతోనే జేసీ అనుచరులు మరింత రెచ్చిపోయారని పేర్కొంటున్నారు. విగ్రహం వెనుక వస్తున్న రెండు ట్రాక్టర్లలో రాళ్లు వేసుకుని ఊరేగింపునకు వచ్చారని, ఆశ్రమం వద్దకు రాగానే ఓ పథకం ప్రకారం దాడులకు తెగబడ్డారని భక్తులు చెబుతున్నారు. ఘర్షణ సందర్బంగా ట్రాక్టర్లను జేసీ అనుచరులే దహనం చేసి తమపై తప్పుడు కేసులు బనాయించేందుకు కుట్ర పన్నుతున్నారని అంటున్నారు. ఓ పథకం ప్రకారమే వారి ట్రాక్టర్లను వారే దహనం చేసుకుని తమపై కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ట్రాక్టర్లకు ఎవరు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉంది. పోలీసులు జేసీ సోదరులకు తొత్తులు తాడిపత్రిలో జేసీ సోదరులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆశ్రమం భక్తులు ఆరోపించారు. ఘర్షణకు పరోక్షంగా సహకరించి, ఆశ్రమంపై జేసీ అనుచరులను ఉసిగొల్పిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా భక్తులు శనివారం రాత్రి ఆశ్రమం ముందు ఆందోళనకు దిగారు. గతంలో ఇదే సీఐ పలుమార్లు జేసీ సోదరుల ప్రోద్బలంతో ఆశ్రమ నిర్వాహకులపై తప్పడు కేసులు బనాయించాడని ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడుబందోబస్తు డ్యూటీ వేయించుకుని ఆశ్రమంపై తెలుగుదేశం పార్టీ వారిని ఉసిగొల్పాడని విమర్శించారు. సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేసీ సోదరులు కక్ష సాధిస్తున్నారు జేసీ సోదరులు ఓ పథకం ప్రకారం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని శ్రీప్రబోధానందశ్రమం డైరెక్టర్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆశ్రమానికి చెందిన దళితుడిని దూషించిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయించామన్న అక్కసుతో తమపై కక్ష సాధిస్తున్నారని పేర్కొన్నారు. సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై ఎస్పీ సీరియస్ నిమజ్జనం సందర్బంగా బందోబస్తు నిర్వహించిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిపై జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు మళ్లీ ఇదే దారి గుండా నిమజ్జనానికి ఎందుకు అనుమతిచ్చారని సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బ్రాహ్మణపల్లిలో ఉద్రిక్తత
► పోలీసుల సాక్షిగా వేటకొడవళ్లతో రెచ్చిపోయిన ప్రత్యర్థులు ► పాతకక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం ► చనిపోయాడనుకుని వదిలివెళ్లిన వైనం తాడిపత్రి రూరల్ : పోలీసుల సాక్షిగా రెచ్చిపోయారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని తమ ప్రత్యర్థి కంటపడగానే ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది చుట్టుముట్టారు. వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఈ ఘటనతో బ్రాహ్మణపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎస్ఐ నారాయణరెడ్డి కథనం ప్రకారం... తాడిపత్రి రూరల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన వన్నూరప్ప(40)పై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో గురువారం దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను చనిపోయాడనుకుని నిందితులు పరారయ్యారు. ఇంటి స్థలం విషయమై... వన్నూరప్పకు అదే గ్రామానికి చెందిన కతాలప్ప కుటుంబాలకు మధ్య ఇంటి స్థలం విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ విషయంగా గతంలో రెండుసార్లు దాడులు చేసుకున్నారు. నెల కిందట వన్నూరప్ప తన బామ్మర్ది మహమ్మద్ రఫీతో కలసి కతాలప్ప కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అంతటితో ఆగక కతాలప్పపై కత్తితో దాడి చేసి, గొంతుకోసి గాయపరిచారు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న కతాలప్ప కుటుంబ సభ్యులు ఎలాగైనా వన్నూరప్పను అంతమొందించాలనుకున్నారు. ఊరు వదిలేయాలనుకుని.. వన్నూరప్ప ఊరు వదిలేయాలనుకున్నాడు. ఇదే విషయం ఎస్ఐ నారాయణరెడ్డికి తెలిపాడు. ఆయన కానిస్టేబుళ్లను అతని వెంట పంపారు. అయితే ముందుగానే ఈ విషయం తెలుసుకున్న కతాలప్ప వర్గీయులు చిన్నోడు, ఎర్రన్న, హాసన్, మూగన్న, అంజినప్ప సహా మరో నలుగురు కలసి రాడ్లు, వేటకొడవళ్లతో సిద్ధమయ్యారు. వన్నూరప్ప ప్రైవేటు వాహనంతో గ్రామానికి చేరుకోగానే కతాలప్ప వర్గీయులు పోలీసులను పక్కకు నెట్టేసి వేటకొడవళ్లతో వన్నూరప్పపై దాడి చేశారు. ఆ తరువాత వారు పరారయ్యారు. తేరుకున్న కానిస్టేబుళ్లు వెంటనే ఎస్ఐకు విషయం తెలిపారు. ఆయన మరికొంత మంది సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. వన్నూరప్పను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆనంతపురానికి తరలించారు. మొత్తం పది మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.