
సాక్షి, కర్నూల్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజుల్లో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో అక్కడ విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లారు. వారు ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తెగిపోయి నీటిలో పడటంతో నలుగురు చిన్నారులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు. వారి మృతితో ఆలంకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: కారులో డ్రైవర్ మృతదేహం.. అసలేం జరిగిందో చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు