భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్ జిల్లాలోని షాపూర్ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Madhya Pradesh | 9 children died after being buried under the debris of a wall in Sagar. Some children are injured, and they are under treatment. All the debris has been removed from the site of the incident: Deepak Arya, Collector, Sagar
(Source - DIPR) pic.twitter.com/saKV2RKADv— ANI (@ANI) August 4, 2024
దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment