Sagar district
-
విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్ జిల్లాలోని షాపూర్ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. Madhya Pradesh | 9 children died after being buried under the debris of a wall in Sagar. Some children are injured, and they are under treatment. All the debris has been removed from the site of the incident: Deepak Arya, Collector, Sagar(Source - DIPR) pic.twitter.com/saKV2RKADv— ANI (@ANI) August 4, 2024దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
కేజీఎఫ్ రాకీభాయ్ స్ఫూర్తితో.. శివప్రసాద్ వరుస హత్యలు
కలకలం రేపిన సెక్యూరిటీ గార్డుల వరుస హత్యల ఉదంతాన్ని.. త్వరగతినే చేధించారు మధ్యప్రదేశ్ పోలీసులు. కన్నడ సెన్సేషనల్ చిత్రం కేజీయఫ్ స్ఫూర్తితోనే తాను హత్యలు చేశానని, రాకీ భాయ్లా పేరు సంపాదించుకుని గ్యాంగ్‌స్టర్‌గా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు నిందితుడు శివ ప్రసాద్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సంచలనం సృష్టించిన ఈ వరుస హత్యల ఉదంతంలో విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూశాయి ఇప్పుడు. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా పరిధిలో వరుసగా సెక్యూరిటీ గార్డులు దారుణంగా హత్యకు గురికావడం.. సంచలనం సృష్టించింది. నిద్రిస్తున్న వాళ్లను అతికిరాతకంగా హత్య చేశాడు 19 ఏళ్ల శివ ప్రసాద్. కేజీఎఫ్ చిత్రంలో లీడ్ రోల్ రాకీ భాయ్ తరహాలో ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ హత్యలు చేసినట్లు శివ ప్రసాద్ పోలీసుల ముందు వెల్లడించాడు. ఎలా దొరికాడంటే.. నిక్కరు, షర్టులో ఉన్న హంతకుడు.. ఓ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. మార్పుల్ రాడ్‌తో ముందుగా బాధితుడిపై వేటు వేసి.. చనిపోయాడా? లేదా? నిర్ధారించుకుని.. బతికే ఉండంతో బండ రాయితో బాది మరీ చంపడం ఆ వీడియోలో ఉంది. అయితే అంతకు ముందు చంపిన వాళ్లలో ఒకరి సెల్‌ఫోన్‌ను తనతో పాటు తీసుకెళ్లాడు నిందితుడు శివ ప్రసాద్. ఈ తరుణంలో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు శివను ట్రేస్ చేసి.. శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. రాకీభాయ్‌లా ఎదగాలనే.. కేజీఎఫ్ సినిమా స్ఫూర్తితోనే తాను ఈ హత్యలు చేశాడని, అందులో ప్రధాన పాత్ర రాకీ భాయ్లా తాను ఎదిగి.. పేరు తెచ్చుకోవాలనే హత్యలు చేశాడని, ఈ క్రమంలో పోలీసులను తర్వాతి లక్ష్యంగా చేసుకున్నట్లు శివ ప్రసాద్ ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తరుణ్ నాయక్ వెల్లడించారు. అంతేకాదు.. ఈ హత్యల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి.. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాతే పోలీసులను లక్ష్యంగా చేసుకుని తన సత్తా చూపించాలని అనుకున్నాడట. ఇదిలా ఉంటే.. భోపాల్‌కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ఏరియాలో శివ ప్రసాద్ వరుసగా నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను హత్య చేసుకుంటూ పోయాడు. ఆగస్టు 28వ తేదీన సుత్తితో కళ్యాణ్ లోధీ అనే సెక్యూరిటీ గార్డును చంపాడు. ఆ మరుసటి రాత్రి శంభు నారాయణ దూబే అనే కాలేజీ సెక్యూరిటీ గార్డును రాయితో కొట్టి చంపేశాడు. ఆ మరుసటి రాత్రి ఓ ఇంటి వాచ్మెన్ అయిన మంగల్ అహిర్వర్ను చంపేశాడు. ఆపై ఒక్కరోజు గ్యాప్‌తో గురువారం రాత్రి సోను వర్మ అనే సెక్యూరిటీ గార్డును అతను కాపాలా ఉండే మార్బుల్ కంపెనీలోనే దారుణంగా హతమార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడం.. బాధితుల సెల్‌ఫోన్ వాడడంతో సిగ్నల్ ఆధారంగా మరుసటి రోజు ఉదయమే భోపాల్‌లో దొరికిపోయాడు శివ ప్రసాద్. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ బయటపడింది. महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk — Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022 గతంలోనూ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను శివ ప్రసాద్ హత్య చేసినట్లు తేలింది. ఈ మే నెలలో ఓవర్‌బ్రిడ్జి పనులు జరుగుతుండగా.. అక్కడ కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డును దారుణంగా చంపేసి.. అతని ముఖంపై ఓ బూట్‌ను ఉంచేసి వెళ్లిపోయాడు. అనంతరం జూన్ చివరి వారంలోనూ ఓ హత్య చేశాడు. అప్పటి నుంచి ‘స్టోన్ మ్యాన్’ భయం మొదలైంది. తాజాగా వరుస హత్యల నేపథ్యంలో హోం మంత్రి నరోత్తం మిశ్రా స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఈ కేసును త్వరగతిన చేధించగలిగారు పోలీసులు. అతని దగ్గర దొరికిన ఆధార్‌కార్డ్ వివరాల ప్రకారం..శివ ప్రసాద్ స్వస్థలం సాగర్ జిల్లా కేస్లీ. తల్లిదండ్రులు, ఇతర వివరాలు తెలియరాలేదు. కాకపోతే ఎనిమిదో తరగతి దాకా చదువుకుని.. గోవాలో కొంతకాలం పని చేశాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. కేజీఎఫ్-2 చిత్రం చూశాక.. ఆ చిత్రంలో రాఖీలా తాను ఎదగాలనే ఉద్దేశంతో ఇలా చేశాడట. అంతకు ముందు హంతకుడి స్కెచ్‌ను విడుదల చేసిన పోలీసులు.. 30వేల రూపాయల రివార్డు ప్రకటించారు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులనే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై మాత్రం నిందితుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: నాన్నా.. వాడు అమ్మను రైలు నుంచి తోసేశాడు -
నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!
సాగర్ (మధ్యప్రదేశ్): కోట్లు విలువచేసే స్మార్ట్ఫోన్లను రవాణా చేస్తున్న కంటైనర్‌ను నలుగురు దొంగలు లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా మహరాజ్‌పూర్ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఈ చోరీ జరిగింది. అయితే ఆ ఫోన్లన్నింటినీ 24 గంటల్లోపే పోలీసులు సినీ ఫక్కీలో స్వాధీనం చేసుకున్నారు. దొంగలు మాత్రం పారిపోయారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన ఈ మొబైల్ ఫోన్లను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా హరియాణాలోని గురుగ్రామ్‌కు తీసుకెళ్తున్నారు. ట్రక్కును గురువారం రాత్రి నలుగురు దుండగులు అడ్డుకుని డ్రైవర్‌ను కిడ్నాప్ చేశారు. నరసింగాపూర్ వద్ద అతన్ని దింపేసి ఫోన్లను కంటైనర్ నుంచి తమ ట్రక్కులోకి మార్చుకుని పారిపోయారు. శుక్రవారం రాత్రి ఘటనాస్థలికి 400 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డగించడంతో ట్రక్కును వదిలేసి పారిపోయారు. మొత్తం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ చెప్పారు. -
చిన్నపాటి ఘర్షణ.. ఆసుపత్రిలోనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ఒక వ్యక్తి తనతో గొడవపడిన మరో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆసుపత్రి సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో సాగర్ బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. దామోదర్ కోరి, మిలన్ మాచే రజాక్ మధ్య గురువారం(జూన్ 10న) ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘర్షణలో దామోదర్ కోరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకునేందుకు బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వచ్చాడు. అయితే తనతో గొడవపడిన కోరిపై ఆగ్రహంతో ఉన్న మిలన్ మాచే కొన్ని గంటల తర్వాత కోరి ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బయటకు వస్తున్న కోరీపై పెట్రోల్ పోసి తన వద్ద ఉన్న లైటర్‌తో నిప్పు అంటించి అక్కడినుంచి పరారయ్యాడు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో కిందపడిపోయిన కోరిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స నిర్వహించారు. కాగా మిలన్ మాచే కోరికి నిప్పు అంటించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సీసీటీవీ, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు మిలన్ మాచే రజాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి ‘న్యూడ్ కాల్ చేస్తావా.. ఫొటోస్ అప్లోడ్ చేయలా?’ -
రోడ్డుపై కరోనా వారియర్: పట్టించుకోని జనం
భోపాల్: కరోనా వారియర్ స్పృహ తప్పి పడిపోతే ఏ ఒక్కరూ చలించలేదు. అరగంటకు పైగా రోడ్డు మీద పడి ఉన్న సదరు పారామెడికల్ సిబ్బందికి సహాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పీపీఈ కిట్లు ధరించిన పారామెడికల్ సిబ్బంది కరోనా రోగులను చికిత్స నిమిత్తం జిల్లాలోని టీవీ ఆస్పత్రి నుంచి బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం తిరిగి ఆస్పత్రికి బయలు దేరారు. (ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..) ఈ క్రమంలో వారిలో ఓ వ్యక్తి ఉన్నపళంగా రోడ్డుపై పడిపోయాడు. ఈ క్రమంలో అతనికి రక్షణగా నిలవాల్సిన సహోద్యోగులు అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అతను 25 నిమిషాల పాటు రోడ్డుపై అచేతనంగా పడిపోయి ఉన్నాడు. రోడ్డు వెంట వెళుతున్న వారు కూడా చూస్తూ వెళ్లిపోయారే తప్పితే సాయం చేసేందుకు ముందడుగు వేయలేదు. సదరు విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. అయితే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి గల కారణాలు తెలియరాలేదు. (చచ్చిపడిన గబ్బిలాలు.. స్థానికుల్లో ఆందోళన!) -
తలపై కొమ్ము.. తానే కత్తిరించుకునేవాడు!
భోపాల్ : డెవిల్ హార్న్‌తో బాధ పడుతున్న ఓ వృద్ధుడికి వైద్యులు ఆపరేషన్ చేసి ఉపశమనం కలిగించారు. తలపై పుట్టుకొచ్చిన కొమ్ము వంటి ఆకారాన్ని సర్జరీ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. రాహి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ యాదవ్(74) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం తలకు గాయమైంది. క్రమేపీ గాయం తాలూకు నొప్పి తగ్గినప్పటికీ తలపై కొమ్ము లాంటి ఆకారం పెరుగుతూ వచ్చింది. తొలుత ఈ విషయాన్ని తేలికగా తీసుకున్న శ్యామ్‌లాల్ ఇంట్లో తనకు తానే దానిని కత్తిరించడం మొదలుపెట్టాడు. అయితే రోజురోజుకీ దాని ఆకారం పెరుగుతుండటంతో వైద్యులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో శ్యామ్‌లాల్ యాదవ్‌ను పరీక్షించిన భాగ్యోదయ్ తిర్త్ ఆస్పత్రి వైద్యులు అతడికి ఆపరేషన్ నిర్వహించి.. కొమ్ము వంటి భాగాన్ని తొలగించారు. అనంతరం ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ...శ్యామ్‌లాల్ ఇన్నాళ్లుగా డెవిల్స్ హార్న్గా పిలువబడే సబాకస్ హార్న్‌తో బాధపడ్డాడని తెలిపారు. సూర్యుడికి ఎక్సపోజ్ అయ్యే చర్మభాగంలో ఒక్కోసారి ఇలా చర్మం పొడుచుకు వస్తుందని పేర్కొన్నారు. కొమ్ము వంటి భాగం మూలాలు లోతుగా లేనందున..దానిని సులభంగా తొలగించామని వెల్లడించారు. ఈ అరుదైన కేసు గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితం చేయాల్సిందిగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. -
వెంటిలేటర్ మీరే తెచ్చుకోండి!
సాగర్: కాలిన గాయాలతో వచ్చిన చిన్నారికి సకాలంలో చికిత్స అందించకపోగా, వెంటిలేటర్‌ను ఆమె తల్లిదండ్రులే ఏర్పాటు చేసుకోవాలని సూచించిన వైద్యురాలు సస్పెన్షన్‌కు గురైంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యురాలి మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించడంతో అసలు విషయం వెలుగుచూసింది. శుక్రవారం ఉదయం అన్షికా అహిర్వార్ అనే ఏడాదిన్నర చిన్నారి వేడి నీటి తొట్టిలో పడిపోవడంతో 70 శాతం శరీరానికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను తల్లిదండ్రులు బుందేల్‌ఖండ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో చిన్నారి ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. మధ్యాహ్నం సమయంలో అటుగా వచ్చిన డాక్టర్ జ్యోతి రౌత్.. చిన్నారిని వెంటిలేటర్లో ఉంచాలని, ఆసుపత్రిలో ఆ సదుపాయం లేదని తెలిపింది. వారే సొంతంగా వెంటిలేటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో చికిత్స జరగకపోవడంతో ఆ చిన్నారి చనిపోయింది. అయితే ఐసీయూ వార్డులో వెంటిలేటర్ ఉందని, చిన్నారిని అక్కడికి తరలించి చికిత్స అందించాల్సిందని డీన్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రౌత్‌పై సస్పెన్షన్ వేటు పడింది. -
పూనమ్.. ఇదేం చోద్యం?
జాబల్పూరు: మహారాష్ట్ర బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ వివాదంలో చిక్కుకున్నారు. రెండు రోజుల క్రితం బినా-భోపాల్ ప్రత్యేక రైలులో ఆమె ప్రయాణించడంపై వివాదం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మే 31న జరిగిన మహారాష్ట్ర సాగర్ జిల్లాలోని బినాలో జరిగిన కార్యక్రమానికి రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన కోసం భోపాల్ నుంచి పశ్చిమమధ్య రైల్వే ప్రత్యేక రైలు పంపింది. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన ఇదే రైలులో భోపాల్ వెళ్లాల్సివుంది. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీలో వెళ్లాలనుకున్నారు. అయితే కార్యక్రమం ఆలస్యంగా పూర్తికావడంతో ఆయన బినా నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో వెళ్లిపోయారు. అయితే బీజేపీ పూనమ్ మహాజన్ ప్రత్యేక రైలులో బినా నుంచి భోపాల్ కు వెళ్లారు. దీనిపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నిలదీసింది. రైల్వే మంత్రి కోసం పంపిన ప్రత్యేక రైలులో ప్రయాణించి ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. ఆమె ప్రొటోకాల్ ఉల్లఘించారని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. అయితే పూనమ్ ప్రత్యేక రైలులో ప్రయాణించడం యాధృచ్చికంగా జరిగిందని, ఆమెను వీఐపీగా చూడలేదని పశ్చిమమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రమేశ్ చంద్రా తెలిపారు. ఎంపీలకు ప్రత్యేక రైళ్లు నడపరాదని రైల్వే నిబంధనలు చెబుతున్నాయి. -
వెయ్యికేజీల పేలుడు పదార్థాలు, 132 డిటోనేటర్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పోలీసులు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా వెయ్యికేజీల పేలుడు పదార్థాలు గుర్తించి సీజ్ చేశారు. దీంతోపాటు 132 డిటోనేటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో పోలీసులు వీటిని గుర్తించారు. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.