
సాక్షి,విజయవాడ: రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు హోంమినిస్టర్ వనిత సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి తన కాన్వాయ్ ఆపి గాయపడిన దంపతులకు సహాయం చేశారు. అంబులెన్స్కు కాల్ చేసి వచ్చే వరకు అక్కడే ఉండి దగ్గరుండి వారిని ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా గాయపడిన దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment