తండ్రి ఇంటికి చేరిన నటి | Actress Vanitha Attack on Father House in Tamil nadu | Sakshi
Sakshi News home page

తండ్రి ఇంటికి చేరిన వనిత

Dec 7 2018 11:06 AM | Updated on Dec 7 2018 11:06 AM

Actress Vanitha Attack on Father House in Tamil nadu - Sakshi

తమిళనాడు, పెరంబూరు: సంచలన నటి వనిత మరోసారి తన తండ్రి ఇంటికి చేరింది. ఇంతకు ముందు షూటింగ్‌ కోసం వచ్చి ఇంటిని ఆక్రమించుకోజూసిన ఈమె ఈ సారి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తన న్యాయవాదితో కలిసి తండ్రి ఇంటిలో పాగా వేసింది. వివరాలు చూస్తే సీనియర్‌ నటుడు విజయకుమార్‌ రెండో భార్య నటి మంజుల ముగ్గురు కూతుర్లలో ఒకరు నటి వనిత. నటుడు విజయకుమార్‌కు స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్‌ 19వ వీధిలో భవంతి ఉంది. దాన్ని ఆయన సినీ, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. ఆయన కూతురైన నటి వనిత ఇటీవల షూటింగ్‌ కోసం ఆ భవంతిలోకి వచ్చి అక్కడే మకాం పెట్టేసింది. దీంతో విజయకుమార్‌ స్థానిక మదురవాయిల్‌ పోలీసులకు వనితపై ఫిర్యాదు చేశారు.

ఈ వ్యవహారంలో పోలీసులు వనితను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించారు. దీంతో నటి వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తన తల్లి మంజుల పేరు మీద ఉన్న ఆ ఇంటిని తాను సినిమాల్లో నటిస్తున్న సమయంలో తన సంపాదనతో కట్టించారని, కాబట్టి ఆ ఇంటిపై తనతో పాటు తన ఇద్దరు సోదరీమణులకు హక్కు ఉంటుందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు నటి వనితకు సాధకంగా తీర్పునిచ్చింది. నటి వనితను ఆ ఇంటి నుంచి పంపే హక్కు ఎవరికీ లేదని, అవసరమైతే పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా నటి వనిత సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల పత్రాలతో గురువారం విజయకుమార్‌ ఇంటికి వచ్చింది. తనతో పాటు తన న్యాయవాదిని కూడా వెంట తీసుకొచ్చింది. సుప్రీమ్‌కోర్టు జారీ చేసిన తీర్పు పత్రాలను చెన్నై పోలీస్‌ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు ఈ సందర్భంగా నటి వనిత మీడియాకు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement