విచారంలో వనిత తల్లి, సోదరి , వనిత (ఫైల్)
పెద్దతిప్పసముద్రం: తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ సమీ పంలోని జహీరాబాద్–మెట్లకుంట్ల రైల్వే సేష్టన్ల మధ్య శనివారం రైలు నుంచి జారి పడి పీటీఎం మండలం సంపతికోట పంచాయతీ కానుగమాకులపల్లికి చెందిన వనిత (21) మృతి చెందింది. కానుగమాకులపల్లికి చెందిన కొత్త వెంకటప్ప గారి వెంకట్రాయుడు, యశోదమ్మ దంపతులకు వనిత, స్వాతి సంతా నం. వనిత కర్ణాటక రాష్ట్రం చింతామణి సిటీ కళాశాలలో ఇంటర్, చిక్ బళ్లాపురంలో డిగ్రీ పూర్తి చేసింది. చిన్న కుమార్తె స్థానికంగా ఇంటర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో వనిత ఆరు నెలల క్రితం బెం గళూరులోని ఓ ప్రైవేటు కంపనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరింది. నెలకోసారి స్వగ్రామానికి వచ్చివెళుతోంది. ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన వనిత బెంగళూరు వెళుతున్నానని చెప్పింది.
ఉన్నట్టుండి వికారాబా ద్ సమీపంలో రైలు నుంచి పడి మృతిచెంది నట్టు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వనిత బెంగళూరుకు కాకుండా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లింది? ఆమె ఒంటరిగా వెళ్లిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా? ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడిందా? లేక ఎవరైనా కిందకు తోసేసారా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వనిత మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆదివా రం హుటాహుటిన వికారాబాద్ వెళ్లారు. వనిత అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment