ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు : రియల్ ఎస్టేట్ వ్యాపారి కంభాల కోటేశ్వరరావు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి తీర్పివ్వగానే కోర్టు నుంచి ముద్దాయి రఫీ చాకచక్యంగా పరారయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2010లో సత్తెనపల్లిలోని ఓ గోడౌన్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కోటేశ్వరరావును కొంతమంది వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఓ స్థల విషయమై కోటేశ్వర రావుతో కొంతమంది వ్యక్తులకు పొరపొచ్చాలు రావడంతో వారు హత్యకు పూనుకున్నారు.
ఈ కేసులో మొత్తం ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగా ఒకరు చనిపోయారు. మిగిలిన ఐదుగురికి గుంటూరు నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.1000 జరిమానా కూడా విధించారు. పారిపోయిన ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారా లేదా అనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వడంలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment