
సాక్షి, సత్తెనపల్లి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం సత్తెనపల్లెకు చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వీరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...వారిద్దరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైఎస్‌ఆర్ సీపీలో చేరిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment