బాబు సర్కార్‌ పతనం ప్రారంభమైంది | YSRCP Leader Jogi Ramesh Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ పతనం ప్రారంభమైంది

Published Sat, Apr 14 2018 6:03 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

YSRCP Leader Jogi Ramesh Fires on CM Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్‌ మండిపడ్డారు. చిట్టినగర్‌లో జరుగుతున్న వైఎస్‌ జగన్‌ బహిరంగ సభకు పెద్ద మొత్తంలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్‌కు పతనం ప్రారంభమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌​ఆర్‌సీపీదే విజయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్సార్‌ పార్టీ నుంచి నీ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎవరి సత్తా ఎంటో తేల్చుకుందామని జోగి రమేష్‌ సవాల్‌​ విసిరారు. ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన వ్యక్తులు ఇప్పడు మా జెండాలను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన 150 సీట్లకు పైగా గెలుస్తామని  జోగి రమేష్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement