నవ నిర్మాణ దీక్ష కాదు..నయవంచన దీక్ష | Jogi Ramesh Slams chandra babu On the issue of Nava Nirmana Deeksha In Vijayawada | Sakshi
Sakshi News home page

నవ నిర్మాణ దీక్ష కాదు..నయవంచన దీక్ష

Published Fri, Jun 1 2018 4:56 PM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

Jogi Ramesh Slams chandra babu On the issue of Nava Nirmana Deeksha In Vijayawada  - Sakshi

విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది నవ నిర్మాణ దీక్ష కాదు..నయవంచన దీక్ష అని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిథి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష ఎందుకు చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏం సాధించారో చెప్పకుండా ఈ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు తనయుడు లోకేష్‌కి కనీస జ్ఞానం లేకుండా మంత్రిని చేసినందుకు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. 

‘ టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక నుంచి మట్టి వరకు దోచుకున్నందుకు దీక్ష చేస్తున్నావా? లేక రాష్ర్టాన్ని అవినీతిమయం చేసినందుకా. కాపులను రిజర్వేషన్‌ పేరుతో, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేసినందుకా? నిరుద్యోగులను భృతి పేరుతో వంచించినందుకా? చంద్రబాబు అవినీతిని చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. హేరిటేజ్‌ను వేల కోట్ల లాభాల్లో ఎలా తీసుకువచ్చారో చెప్పండ’ ని సూటిగా చంద్రబాబునుద్దేశించి జోగి రమేష్‌ ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement