'బాబుకు అల్జీమర్స్ సోకినట్లుంది'
విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనే విషయాన్ని హెరిటేజ్ వాహనాల్లో ఎర్రచందనం దుంగలు పట్టుబడటం స్పష్టం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేశ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనవసరంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేసిన బాబు.. తన ప్రభుత్వంలో ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? అని ప్రశ్నించారు. సీబీఐ అంటే బాబు ఎందుకు అంత భయమని అన్నారు. విశాఖలో లక్ష ఎకరాల భూమిని టీడీపీ నేతలు మింగారని ఆరోపించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లు అనుమానంగా ఉందని అన్నారు.
లేకపోతే ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి అలా ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. వ్యాధి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని బాబుకు సూచించారు. బీరు హెల్దీ డ్రింక్ అంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలు.. ఆ స్ధాయి వ్యక్తి మాట్లాడాల్సినవిగా లేవని అన్నారు. మరో మంత్రి లోకేష్ జవహర్ మాటలను సమర్ధించడం గర్హనీయమని అన్నారు. మంత్రులు ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసి సేల్స్ మేనేజర్లుగా మారాలని సూచించారు. లోకేష్ పేరులో ఉన్న లోకజ్ఞానం ఆయనకు లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్లారని అన్నారు.