
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన రాణిగంజ్ డిపో కండక్టర్ సురేందర్‌గౌడ్ మృతదేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నివాళులర్పించారు. సోమవారం సురేందర్ గౌడ్ తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేందర్‌గౌడ్ కుటుంబసభ్యులను బీజేపీ నేత లక్ష్మణ్ పరామర్శించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. పోరాడి మన హక్కులు సాధించుకుందామని లక్ష్మణ్ సూచించారు. శ్రీనివాసరెడ్డి, సురేందర్ గౌడ్ మృతితో మరో తెలంగాణ ఉద్యమం మొదలైందని తెలిపారు. కార్మికుల ఉసురు కేసీఆర్‌కు తప్పకుండా తగులుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment