Conductor Misbehaving With Women In City RTC Bus At Hyderabad - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్‌ అసభ్యకర ప్రవర్తన.. టికెట్స్‌ ఇస్తుండగా..

Published Sun, Jun 19 2022 6:08 PM | Last Updated on Sun, Jun 19 2022 6:21 PM

Conductor Indecent Behavior With Women On City RTC Bus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్‌.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బ‌స్సులో మ‌హిళా ప్ర‌యాణికుల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్‌ ఇచ్చే క్రమంలో మహిళా ప‍్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్‌.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్‌ అమీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement