కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశాడో భర్త. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణోదంతం జరిగింది.
హైదరాబాద్: కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశాడో భర్త. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణోదంతం జరిగింది. కాచిగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న జమునారాణిని ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు.
అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ కలహాల కారణంగానే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.