సంఘమిత్ర నుంచి శ్రుతి తప్పుకొందా?
ప్రతిష్ఠాత్మకంగా రాబోతున్న సంఘమిత్ర ప్రాజెక్టు నుంచి హీరోయిన్ శ్రుతి హాసన్ తప్పుకొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సుందర్ సి. దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత సారథ్యంలో టాప్ టెక్నీషియన్లతో వస్తున్న ఈ సినిమాలో నటించడం అంటే చిన్న విషయం కాదు. తమిళ దర్శకుడు సుందర్ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేశారు.
సోషియో ఫాంటసీ డ్రామాలలో శ్రుతి నటించి కూడా చాలా కాలమైపోయింది. ఇన్నాళ్లూ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్‌గా ఎక్కువ సినిమాల్లో శ్రుతి చేసింది. ఇప్పుడు ఆమెకు ఇది ఒక మంచి అవకాశమని, వారియర్ ప్రిన్సెస్‌గా తనను తాను ప్రూవ్ చేసుకుంటుందని, టైటిల్ రోల్‌కు శ్రుతి అయితేనే పెర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ, ఆ సినిమా నుంచి ఆమె బయటకు వచ్చేసిందని టాక్ గట్టిగా వచ్చింది. దాంతో ఏమీ చేయలేని చిత్ర యూనిట్ మరో హీరోయిన్‌ను వెతుక్కునే పనిలో పడిందట.