సుకుమారి... వీరనారి | Shruti Haasan to star in Sundar C's film Sangamithra | Sakshi
Sakshi News home page

సుకుమారి... వీరనారి

Published Thu, Apr 6 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

సుకుమారి... వీరనారి

సుకుమారి... వీరనారి

‘ఏం చక్కని మందారం.. ఇది ఎనిమిది దిక్కుల సింధూ రం’... అని హీరో పాడుతుంటే.. హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ సుతి మెత్తగా అడుగులు వేస్తూ, తన సుకుమారాన్నంతా నడకలోనే ప్రదర్శించేసింది. అది పాట కాబట్టి అలా కనిపించింది. అదే ఫైట్‌ అయితే వీరనారిలా విజృంభిస్తుంది. ‘సంఘమిత్ర’ సినిమాలో అలాంటి పాత్రనే చేయనుంది శ్రుతి. నటి ఖుష్బూ భర్త సుందర్‌. సి దర్శకత్వంలో మూడు భాషల్లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది.

ఇందులో కథానాయికగా నటించనున్న శ్రుతి ప్రస్తుతం ట్రైనింగ్‌ తీసుకునే పని మీద ఉంది. టిమ్‌ క్లోజ్‌ క్లోజ్‌ అనే ఫైట్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో లండన్‌లో ఆమె ఫైట్స్‌ నేర్చుకుంటోంది. అక్కడ సిన్సియర్‌గా శిక్షణ తీసుకుంటూ, ఖాళీ సమయాల్లో లండన్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తోంది. అలాగే, అక్కడి వంటకాలను కూడా ఓ పట్టు పడుతోందామె. ‘జయం’ రవి, ఆర్య హీరోలుగా నటించనున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరకర్త. మన ‘బాహుబలి’కి ప్రభాస్‌ మూడు నాలుగేళ్లు కేటాయించినట్లే ఈ చిత్రం కోసం ‘జయం’ రవి, ఆర్య ఏడాదిన్నరకు పైగా డేట్స్‌ ఇచ్చేశారట. శ్రుతీహాసన్‌ కూడా ఈ చిత్రానికి ఎక్కువ రోజులు ఇచ్చారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement