'నువ్వు ప్రపోజ్‌ చేసిన క్షణం.. కళ్లార్పకుండానే': సీనియర్ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Kushboo: 29 ఏళ్ల ప్రేమ.. ఇప్పటికీ ఏం మారలేదు: ఖుష్బు ఎమోషనల్ పోస్ట్

Published Thu, Feb 22 2024 8:02 AM

Kushboo Shares Her Love Proposal By Sunder C post Goes Viral - Sakshi

సీనియర్ నటి ఖుష్బు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో మెప్పించింది. 1990లో సౌత్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోనూ స్టార్‌ ‍హీరోల సినిమాల్లో మెప్పించింది. కాగా.. 1995లో మురై మామన్ చిత్రంలో నటిస్తుండగానే డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాద ఐదేళ్లకు మార్చి 9న 2000 ఏడాదిలో దర్శకుడు సుందర్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

అయితే తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను పంచుకుంది. తన భర్త ప్రపోజ్‌ చేసిన తేదీని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.  ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని పోస్ట్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ప్రపోజ్ చేయగానే ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించానని రాసుకొచ్చింది. 29 ఏళ్ల క్రిత నేను తీసుకున్న ఆ నిర్ణయం అత్యుత్తమమని ఖుష్బు ఎమోషనలయ్యారు.

ఖుష్బు తన ట్వీట్‌లో రాస్తూ..'22 ఫిబ్రవరి 1995 నుంచి.. 22 ఫిబ్రవరి 2024 వరకు ఏమీ మారలేదు. కేవలం నా వయసు మాత్రమే పెరిగింది అంతే. మీలో ఉప్పు, మిరియాల సువాసన అలానే ఉంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం.. మన తప్పులను అంగీకరించడం.. ఒకరినొకరు ప్రోత్సహించడం. ఆపద సమయంలో అండగా నిలవడం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని.. మన అందమైన కుటుంబాన్ని నిర్మించే మార్గంలో నడుస్తున్నాం. మీరు నాకు ప్రపోజ్ చేసి ఈ రోజుకు 29 సంవత్సరాలైంది. ఎలాంటి కెమెరాలు, ఫోటోలు, సోషల్ మీడియా లేని రోజుల్లో నీ ప్రేమను అంగీకరించా. ఒక్కసారి ఆలోచించకుండా.. కను రెప్పవేయకుండానే ఓకే చెప్పా. కొన్నిసార్లు ఉత్తమ నిర్ణయాలు గట్స్‌ ఫీలింగ్‌తో తీసుకోబడతాయి. ఈ రోజు మీరు అది నిరూపించారు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. మీ ప్రపోజల్‌ను అంగీకరించడం నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయం. నీపై 29 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది.' అంటూ పోస్ట్ చేసింది. 

కాగా.. ఖుష్బు గతేడాది తెలుగులో గోపించంద్‌ చిత్రం రామబాణంలో కనిపించింది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందువల్లే సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకుడు సుందర్ తమిళంలో 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతే కాదు 20కి పైగా సినిమాల్లో నటించారు. ఉల్లతై అల్లిత, అరుణాచలం, అన్బే శివం, విన్నర్, గిరి, కలకలప్పు, తీయ వేళై సెయ్యనుం కుమారు, అరణ్మనై, అంబాల, వంత రాజావతాన్ వరువేన్ సినిమాలు చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement