సంఘమిత్రలో దీపిక నటిస్తుందా? | Deepika Padukone to star in a Tamil big-budget Period film 'Sanghamitra' | Sakshi
Sakshi News home page

సంఘమిత్రలో దీపిక నటిస్తుందా?

Oct 3 2016 2:29 AM | Updated on Sep 4 2017 3:55 PM

సంఘమిత్రలో దీపిక నటిస్తుందా?

సంఘమిత్రలో దీపిక నటిస్తుందా?

బాలీవుడ్ టాప్ కథానాయికల్లో దీపికాపడుకొనే ఒకరు. చాలా మంది ఉత్తరాది బ్యూటీస్‌లానే ఈ అమ్మడికి కోలీవుడ్‌పై ఓ కన్ను.

బాలీవుడ్ టాప్ కథానాయికల్లో దీపికాపడుకొనే ఒకరు. చాలా మంది ఉత్తరాది బ్యూటీస్‌లానే ఈ అమ్మడికి కోలీవుడ్‌పై ఓ కన్ను. తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆశను సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన మోషన్ ఫార్మాట్‌లో తెరకెక్కిన యానిమేషన్ త్రీడీ చిత్రంతో తీర్చుకున్నారు. అయితే ఆ ఒక్క చిత్రంతో ఒక్కడి దర్శక నిర్మాతలకు దీపికపై మోజు తీరలేదు. ఆ తరువాత చాలా మంది ఈ ముద్దుగుమ్మను కోలీవుడ్ తెరపై చూపించాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. ప్రస్తుతం ఆంగ్ల చిత్రంలో నటిస్తున్న దీపికాపడుకోనే హిందీ చిత్రాలకే కాల్‌షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి.
 
 ఇలాంటి స్థితిలో నటి కుష్భు భర్త, దర్శకుడు సుందర్.సీ ఈ అమ్మడిని తన చిత్రంలో నటింపజేసే పనిలో ఉన్నట్లు తాజా సమాచారం. ఈయన సంఘమిత్ర అనే బ్రహ్మాండ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇందుకు బాహుబలి చిత్రం స్థాయిలో చారిత్రక కథను ఎంచుకున్నట్లు సమాచారం. శ్రీతెనాండాళ్ ఫిలింస్ సంస్థలో వందో చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో మొదట ఇళయదళపతిని హీరోగా నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. కథ విన్న ఆయన చాలా బాగుందని కితాబిచ్చారు గానీ, ఈ చిత్రానికి అవసరం అయిన కాల్‌షీట్స్ కేటాయించలేనని చేతులెత్తేశారు.
 
  ఆ తరువాత సూర్య పేరు చర్చల్లోకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, జయంరవి, ఆర్య ఈ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్నట్లు సమాచారం. అందువల్ల మూడు భాషలకు తగ్గ నాయకిని సంఘమిత్ర కోసం ఎంపిక చేయాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు, అందుకు నటి దీపికాపడుకొనే అయితే బాగుంటుందన్న భావనతో ఆమెతో సంప్రదిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆ బ్యూటీ సంఘమిత్రలో భాగం అవుతారా?అన్నదే చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ చిత్రంలోని తారాగణం గురించి దర్శకుడు సుందర్.సీ నోరుమెదపడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement