Yash-Deepika Padukone: - Sakshi
Sakshi News home page

Yash : ఆ హీరోయిన్‌ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్‌

Published Thu, Apr 21 2022 2:55 PM | Last Updated on Thu, Apr 21 2022 4:10 PM

Yash Wanted To Debut In Hindi Films With Deepika Padukone - Sakshi

కేజీయఫ్ 2తో రాకీ భాయ్ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా 'కేజీఎఫ్ 2' గురించే టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు హీరో యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్‌తో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్‌-2 సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న యశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన ఫేవరెట్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె అని, ఆమెతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అంతేకాకుండా దీపిక నటన ఎంతో బావుంటుందని, ఆమె సినిమాలను చూస్తూ ఉంటానని యశ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement