శింబుతో జోడీ కట్టనున్న బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె | Deepika Padukone To Act in Simbu Movie | Sakshi
Sakshi News home page

Deepika Padukone: శింబుకు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌

Published Sun, May 14 2023 7:10 AM | Last Updated on Sun, May 14 2023 7:10 AM

Deepika Padukone To Act in Simbu Movie - Sakshi

హీరో శింబుతో జతకట్టడానికి బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె సై అంటుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే! శింబు ఇటీవల నటించిన మానాడు, వెందు తనిందది కాడు చిత్రాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. అయితే తాజాగా గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించిన పత్తుతల చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీన్ని విశ్వనాయకుడు కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దీనికి కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయడిత్తాళ్‌ చిత్రం ఫేమ్‌ దేసింగు పెరియసామి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ కథకు మొదట రజనీకాంత్‌ను హీరోగా  అనుకున్నారు. అనివార్య కారణాలతో అది మిస్సైంది. దీంతో అదే కథతో శింబు హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇందులో శింబుకు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణెను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈమె ఇటీవల యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోసిన పఠాన్‌ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అలాంటి బ్యూటీ ఇప్పుడు శింబుతో రొమాన్స్‌ చేయడానికి సై అంటుందా అన్నదే చర్చ. శింబు కంటే చాలా ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్‌ దీపిక. అయితే ఇక్కడ నిర్మాత కమల్‌ హాసన్‌ కావడంతో ఆమె శింబుతో నటించే అవకాశాలే ఎక్కువగా ఉంటుందని సమాచారం. అలాగే ఇందులో కమల్‌ హాసన్‌ గౌరవ పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జూన్‌లో సెట్‌ పైకి వెళ్లనుంది. కాగా దీపిక పదుకొనే ఇంతకుముందు కోలీవుడ్‌లో రజనీకాంత్‌ సరసన కొచ్చాడయాన్‌ యానిమేషన్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే!

చదవండి: ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం, నటి అరెస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement