వారిద్దరు సంఘమిత్రలో నటిస్తారా? | Deepika Padukone and Sonakshi Sinha in Sanghamitra? | Sakshi
Sakshi News home page

వారిద్దరు సంఘమిత్రలో నటిస్తారా?

Published Fri, Feb 3 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

వారిద్దరు సంఘమిత్రలో నటిస్తారా?

వారిద్దరు సంఘమిత్రలో నటిస్తారా?

సంఘమిత్ర చిత్రంలో నటించే హీరోల కోసం చాలా చర్చలే జరిగాయి. ఇళయదళపతి విజయ్, టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నుంచి చాలా మంది ప్రముఖ స్టార్‌ నటులను సంప్రదించారు. అందరూ కథ సూపర్‌ అన్నారే గానీ అందులో నటించడానికి సందేహించారు. కారణం ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే రూపొందించనంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రానికి 250 రోజుల కాల్‌షీట్స్‌ అవసరం అవడమే. మొత్తానికి యువ స్టార్స్‌ జయంరవి, ఆర్య ఈ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇక హీరోయిన్లు ఎవరన్న చర్చ మొదలైంది. ఆ పాత్రల కోసం చాలా మంది టాప్‌ స్టార్స్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇది తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతున్న బ్రహ్మాండ చారిత్రక కథా చిత్రం కావడంతో అందుకు తగ్గట్టుగా కథానాయికలు ఉండాలని చిత్రయూనిట్‌ వర్గాలు భావిస్తున్నారు.

అందుకు బాలీవుడ్‌ బ్యూటీస్‌ దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా కరెక్ట్‌గా ఉంటారని భావించిన దర్శక నిర్మాతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఇప్పటికే కోలీవుడ్‌లో రజనీకాంత్‌ సరసన ఒక్కో చిత్రంలో నటించిన అనుభవం ఉండడం కూడా వారిని సంఘమిత్ర చిత్రంలో నాయికలుగా ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ అందాల భామలు అంగీకరిస్తారా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహించనున్నారు.

సంగీతమాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్  సంగీతాన్ని, సబుసిరిల్‌ కళా దర్శకత్వాన్ని, కమల్‌ కన్నన్  గ్రాఫిక్స్, హిందీ చిత్రం భాజీరావ్‌ మస్తాని ఫేమ్‌ సందీప్‌ చటర్జీ ఛాయాగ్రహణం అందించనున్నారు. రచయిత ప్రభాకరన్, దర్శకుడు బద్రి సంఘమిత్రకు కథా సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement