సమంత అలా...శృతి ఇలా..
ముంబాయి: అందాల భామలు కర్ర సాము, కత్తి యుద్ధ విన్యాసాలతో అభిమానులను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న సమంత కర్ర సాముతో ఆకట్టుకుంటే, శృతిహాసన్ కత్తి ఫైట్‌తో వార్తల్లోనిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెకకునున్న చారిత్రాత్మక సినిమా ‘సంఘమిత్ర’లో లీడ్ రోల్‌కు ఎంపికైన శృతి పూర్తిగా సినిమా మూడ్‌లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది. నిపుణుల సమక్షంలో కత్తి యుద్ధం, మల్ల యుద్ధం వంటివి బాగా ప్రాక్టీసు చేస్తోంది. దీనికి సంబంచిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. మార్షల్ ఆర్ట్స్ నా జీవితంలో భాగం అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుకోసం కత్తి ఫైటింగ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
సంఘమిత్ర సినిమా కోసం కత్తి పోరాటాలను నేర్చుకుంటూ మానసికంగా రడీ అవుతోంది. ఈ సినిమాలో యువరాణిగా అలరించనున్న శృతి ప్రత్యేకంగా లండన్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. లండన్ లో పేరొందిన యాక్షన కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్ కత్తి యుద్ధ ఎక్స్‌పర్ట్ ఈమెకు శిక్షణ ఇస్తున్నారట.
హిస్టారికల్ మూవీ ‘సంఘమిత్ర’ కోసం ఈ కత్తి యుద్ధం నేర్చుకోవడంతో ఆనందంగా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అటు అభిమానులను, సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ అయింది.
మెగా బడ్జెట్ తో సుందర్ సి నిర్మాతగా రానున్న ఈ ట్రై-లింగ్వల్ మూవీలో శృతి యువరాణి పాత్ర పోషించనుంది. ఇంకా ఆర్య, జయం రవి హీరోలుగా నటించనున్న ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతుంది. శ్రీ తేన్నందర్ ఫిల్మ్స్ పతాకంపై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తం 11 దేశాల్లో సంఘమిత్ర చిత్రీకరణ జరగనుందని టాక్.