సామాజికత తెలుసుకోవడానికి
నయా టెక్నాలజీతో సిటీ పోటీపడుతోంది. ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సరైన వేదిక లేదని గ్రహించిన నగరవాసి వీవీ రాజా ‘లెర్నింగ్ సోషల్’కు అంకురార్పణ చేశారు. ఇప్పుడిది విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు... ఇలా ఎంతో మందికి కెరీర్ లబ్ధిని కలిగిస్తోంది.
సిటీ యువతే కాదు ఉద్యోగులూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచంతో పాటు తాము కూడా పరుగులు పెట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. చదివిన చదువుకు వారు ఉద్యోగాలు చేసే కంపెనీల్లో పనికి ఏమాత్రం సంబంధం లేకపోవడంతో తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత అది పరిష్కారమయ్యేందుకు తమను తాము మార్చుకునే దిశగా నడుస్తున్నారు. చదువులో ఇరగదీసి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్‌తో ఉపాధి దొరకని యువతకు, ఉద్యోగం చేస్తూ ఆధునిక సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో వెనుకబడినవారికి ‘లెర్నింగ్ సోషల్’ చక్కని వేదికగా నిలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టి, సిటీలో స్థిరపడిన రాజు వనపాల నుంచి వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి బంగారు బాటను చూపిస్తోంది. సమాజంలో చోటుచేసుకుంటున్న నూతన ఒరవడిని ఇలా అందిపుచ్చుకోవచ్చని ఆన్‌లైన్ వేదికగా పాఠాలు నేర్పుతోంది. ఆయా రంగాల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులను ఇన్‌స్ట్రక్టర్‌లుగా తీసుకొని ఈ టెక్నాలజీ టీచింగ్ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతోంది. బాస్ ఇచ్చిన పనికి రెట్టింపు చేసి పెడుతున్నారు. ఇది వారి కెరీర్ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్, డాటా అనాలసిస్, డేటా సైన్స్, హడూప్, అనలిటిక్స్, రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్.. ఇలా వివిధ కోర్సులతో పాటు ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే టెక్నాలజీ చదువులను అందిస్తోంది. ఉద్యోగం చేసేవాళ్లకు కోచింగ్‌లకు వెళ్లే సమయం లేకపోవడంతో ఈ లెర్నింగ్ సోషల్ వైపు చూస్తున్నారు. ఇంటి వద్దనే ఉండి సాంకేతిక పాఠాలను నేర్చుకొని ఉద్యోగంలో ముందుకు దూసుకెళుతున్నారు.
‘డిజిటల్’ డిమాండ్...
ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ-మెయిల్, ఆన్‌లైన్, సోషల్ మీడియా ద్వారా అడ్వర్టైజింగ్ చేయడం ఎలా అనే దానిపై ఇప్పుడున్న యువతకు పెద్దగా అవగాహన లేదు. అందుకు తగ్గ శిక్షణ కేంద్రాలు కూడా కనిపించవు. లెర్నింగ్ సోషల్ ‘డిజిటల్ మార్కెటింగ్’ శిక్షణను ఇస్తోంది. ఆండ్రాయిడ్ టెక్నాలజీ, డేటా అనాలసిస్‌ను నేర్పుతోంది.
వి.ఎస్
ఎంతో మందికి లబ్ధి
2006లో మూడు లక్షలతో ‘వే టు ఎస్‌ఎంఎస్’ ప్రారంభించి సక్సెస్ సాధించా. ఈ క్రమంలోనే 2012లో నాకు ఎదురైన సమస్యకు
ఆన్‌లైన్‌లో అనలిటిక్స్ నేర్చుకోవాలనుకున్నా. సెర్చ్ చేశా. అయితే ఇన్‌స్ట్రక్టర్లు ఉన్న ఏ ఆన్‌లైన్ వేదికా దొరకలేదు. అప్పుడే లెర్నింగ్ సోషల్‌కు బీజం పడింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు... ఇలా అందరూ కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆయా రంగాల్లో ప్రావీణ్యం పొందిన ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా పాఠాలు చెప్పిస్తున్నా. ఇప్పటికే 300 మందికి పైగా
ఇన్‌స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు. సుమారు 70 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.
- వీవీ రాజా,
లెర్నింగ్ సోషల్ వ్యవస్థాపకుడు