ఉపాధి పనుల్లో అవినీతి | Employment in the midst of corruption | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల్లో అవినీతి

Published Sat, Sep 12 2015 4:02 AM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

Employment in the midst of corruption

సామాజిక తనిఖీలో వెలుగులోకి
 రూ.37.93 లక్షలు దుర్వినియోగమైనట్లు వెల్లడి

 
నర్సింహులపేట : మండలంలోని చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన పరిశీలనలో ఇది వెలుగులోకి వచ్చింది. మండలంలో సెప్టెంబర్ 1, 2014 నుంచి మే 31, 2015 వరకు 1933 పనులు నిర్వహించారు. ఇందుకోసం రూ.4,29,30,341 విడుదలయ్యూరుు. వీటిపై ఈనెల ఒకటి నుంచి 9వ తేదీ వరకు తనిఖీ చేశారు. జయపురం, కొమ్ములవంచ, కౌంసల్యదేవిపల్లి, దంతాలపల్లి, పెద్దముప్పారం, ఆగపేట, పెద్దనాగారం, గున్నెపల్లిలో చేపట్టిన ఉపాధి హామీల్లో అవినీతి చోటుచేసుకుందని గుర్తించారు.

మొత్తం 21 గ్రామాల్లో పనులకు రికార్డులు లేకపోవడం, కొలతల్లో తేడాలు, మరుగుదొడ్లు నిర్మింయచకుండానే బిల్లులు స్వాహా చేయడం, పాత వాటికి రంగులు వేసి బిల్లులు పొందడం, కూలీలు పనులు చేసినా చెల్లించకపోవడం తదితర అక్రమాలు చేసుకున్నట్లు తేల్చారు. రూ.37,93,922 దుర్విని యోగమైనట్లు ప్రజావేదికల్లో తనిఖీ బృందం డ్వామా అధికారుల సమక్షంలోనే వెల్లడించా రు. డ్వామా అడిషనల్ పీడీ శ్రీనివాసుకుమార్, జిల్లా విజిలెన్స్ అధికారి పర్యవేక్షణలో రూ.3,28,000 రికవరికీ ఆదేశాలు జారీ చేశారు. వంతడపల గ్రామంలో ఎలాంటి అవినీతి జరగలేదని తేలడంతో అక్కడి ఫీల్డ్ అసిస్టెంట్ ను అధికారులు అభినందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement