రిషితేశ్వరి మృతి సామాజిక సమస్య | rishikeswari suicide is a social issue, says her father | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి మృతి సామాజిక సమస్య

Published Thu, Sep 3 2015 4:42 AM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

రిషితేశ్వరి మృతి సామాజిక సమస్య - Sakshi

రిషితేశ్వరి మృతి సామాజిక సమస్య

రిషితేశ్వరి మృతి సంఘటన తన ఒక్కడి సమస్య కాదని, దీనిని సామాజిక సమస్యగా భావించాలని ఆమె తండ్రి మురళీకృష్ణ చెప్పారు.

* విలేకరులతో విద్యార్థిని తండ్రి మురళీకృష్ణ
* బెయిల్ పిటిషన్ కేసు నేటికి వాయిదా

సాక్షి, గుంటూరు: రిషితేశ్వరి మృతి సంఘటన తన ఒక్కడి సమస్య కాదని, దీనిని సామాజిక సమస్యగా భావించాలని ఆమె తండ్రి మురళీకృష్ణ చెప్పారు. రిషితేశ్వరి మృతికేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులు హనీ షా, జయచరణ్, శ్రీనివాస్‌ల బెయిల్ పిటిషన్‌పై బుధవారం గుంటూరులోని ఒకటో అదనపు సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. దీన్ని గురువారానికి వాయిదా వేస్తూ ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపీనాథ్ ఆదేశించారు.

ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్ బాబూరావును వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని పోలీసులు చెప్పడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement