ఈ రోబో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తుంది! | Robots Are Learning How to Move Through a Crowd | Sakshi
Sakshi News home page

ఈ రోబో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తుంది!

Published Sun, Sep 3 2017 1:52 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

ఈ రోబో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తుంది! - Sakshi

ఈ రోబో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తుంది!

మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొత్తరకం రోబోను తయారుచేశారు. సామాజిక అవగాహన వ్యవస్థ (సోషల్‌ అవేర్‌నెస్‌ నావిగేషన్‌)తో కూడిన ఈ రోబో.. ఎంతటి రద్దీ ప్రాంతంలోనైనా ఎవరినీ ఢీకొట్టకుండా సాగిపోతుందట. అంతేకాదు ట్రాఫిక్‌ నియమాలను కూడా కచ్చితంగా పాటిస్తుందని చెబుతున్నారు. వాహనం నడిపే డ్రైవర్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఎలా పరిశీలిస్తూ ముందుకు సాగుతాడో ఈ రోబో కూడా అచ్చంగా అలాగే పరిస్థితులను బట్టి ముందుకు సాగిపోతుందట.

బోస్టన్‌ ట్రాఫిక్‌ రూల్స్‌ ప్రకారం.. రోడ్డుకు కుడివైపునే ప్రయాణించడం, ఎడమవైపు నుంచి ఓవర్‌టేక్‌ చేయడం, వాహనానికి, వాహనానికి మధ్య ఉండాల్సిన గ్యాప్‌ను కొనసాగించడం, ఎరుపు, ఆకుపచ్చ సిగ్నల్స్‌ పడినప్పుడు ఆగడం, ముందుకు కదలడం వంటి నియమాలను కచ్చితంగా పాటిస్తుందని చెబుతున్నారు. పరిస్థితులను అంచనా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకునే ఇటువంటి రోబోల రూపకల్పనతో భవిష్యత్తులో మరెన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement