రైస్ బకెట్ | Laxmi takes up the rice bucket challenge | Sakshi

రైస్ బకెట్

Published Thu, Sep 25 2014 12:57 AM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM

రైస్ బకెట్ - Sakshi

రైస్ బకెట్

విద్యార్థులు సామాజిక చైతన్యంతో ముందుకు కదిలారు. బస్తీల్లోని నిరుపేదలకు బియ్యం పంచి తోచిన సాయమందించారు. రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సన్‌రైజ్‌లు కంటోన్మెంట్ మడ్‌పోర్డ్‌లోని ఉత్తరయ్య హట్స్‌లో బుధవారం ‘రైస్ బకెట్ చాలెంజ్’ నిర్వహించాయి. గుడిసెల్లో ఉండే పేదలకు ఐదు వందల కిలోల బియ్యాన్ని ఈ సందర్భంగా పంపిణీ చేశారు. కాశ్మీర్ వరద బాధితులకు కూడా ఐదు వందల కిలోల బియ్యం పంపినట్టు కార్యక్రమ నిర్వాహకురాలు పూర్ణిమారెడ్డి తెలిపారు.
 - రసూల్‌పురా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement