అలా చేయాల్సింది కాదన్నారు..!
లైఫ్‌బుక్
సినిమాలకు ముందు ప్రకటనల్లో నటించాను. ఆర్థిక స్వాతంత్య్రమంటే ఏమిటో అప్పుడే తొలిసారిగా తెలిసింది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు కొందరు. ఆచితూచి పాత్రలు ఎంపిక చేసుకునేవారు కొందరు. మొదటి దాని వల్ల డబ్బు వస్తుంది. రెండో దాని వల్ల తృప్తి మిగులుతుంది. నేను రెండో కోవలో ఉండాలను కుంటున్నాను. డబ్బు కంటే తృప్తికే ప్రాధాన్యత ఇవ్వాలను కుంటున్నాను. ‘బ్లాక్’ సినిమాలో చేసినప్పుడు ‘‘సహాయక పాత్ర చేయడం ఏమిటి? అలా చేసి ఉండాల్సింది కాదు!’’ అన్నవాళ్లు ఉన్నారు. నేను మాత్రం అదేమీ పట్టించుకో కుండా నటించాను. అదొక గొప్ప భావోద్వేగ ప్రయాణం.
కొన్ని రంగాలలోకి అడుగుపెట్టినప్పుడు...కొన్ని అలవా ట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నాకు కొత్త వారితో మాట్లాడాలంటే సిగ్గు. సినిమా రంగంలో ఇది కుదరదు కదా... అందుకే ఈ అలవాటు నుంచి బయటపడడానికి కష్టపడాల్సి వస్తుంది.
‘బ్లాక్’లాంటి హృదయం కదిలించే సినిమాలు చేసినా, ‘టాంగో చార్లీ’లాంటి మాసాల సినిమా చేసినా, ‘ఓవర్ ది మౌంటెన్’లాంటి అంతర్జాతీయ చిత్రాలు చేసినా నేను చేసే పాత్ర గురించి హోంవర్క్ చేయడం మరవను.
శాంతినికేతన్‌లో చిన్నప్పుడు రవీంద్రుడి గీతాలు పాడేదాన్ని. మణిపురి నృత్యం అక్కడే నేర్చుకున్నాను.
సినిమా అనేది కేవలం వినోదం కోసం అనే మాటను నమ్మను. సినిమాతో సామాజిక సందేశాన్ని ప్రజలకు చేరువ చేయవచ్చు. ‘యాక్టర్’లో ‘యాక్టివిస్ట్ట్’ కూడా ఉన్నా రు. కాబట్టి నటులు సామాజిక స్పృహకు సంబంధించిన పనుల్లో పాల్గొంటే ఆ ప్రభావం ఇతరులపై గాఢంగా ఉంటుంది. సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సామా జిక కార్యక్రమాలకు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉండలేదు.
- నందనా సేన్, హీరోయిన్