
తెలుగుసీమకు కల్బుర్గి సందేశం
ఏపీ మెజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శిగా గతంలో చాలా సంవత్సరాలు పనిచేశాను. పూ ర్వాంధ్రప్రదేశ్‌లోని మొత్తం 23 జిల్లాలలో వేలాది ప్రదర్శనలివ్వడంతో పా టు ఢిల్లీ, ముంబై, కోల్ కతా, భువనేశ్వర్, కటక్, రాయపూర్, చెన్నై, బెంగ ళూరు, జైపూర్, భోపాల్, అమృత్‌సర్, తిరువనంత పురం, కొచ్చిన్ తదితర నగరాలలో కూడా ఇంద్రజా లికునిగా నా ముప్ఫై ఏళ్ల వృత్తిలో ప్రదర్శనలిచ్చాను. కర్ణాటక, ధార్వాడ్‌లో గత నెల 30వ తేదీన మల్లేశప్ప కల్బుర్గి మరణవార్త నన్ను కలచివేసింది.
మూఢన మ్మకాల వ్యతిరేక సామాజిక ఉద్యమకారులుగా మా మధ్య పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం ఐదు రోజుల పాటు బెంగళూరులో జరిగిన ఒక సమ్మేళనం సంద ర్భంలో మా మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఆయన హత్య వార్త నన్ను చాలా బాధకు గురిచేసిం ది. విజయవాడ వాసిగా, తెలుగువాడిగా, సాటి మూఢనమ్మకాల వ్యతిరేక ఉద్యమకారుడిగా ఆయ నతో నా అనుబంధాన్ని కన్నీటి అశ్రువు లతో తెలుగు సమాజం దృష్టికి తేవడం నా కనీస ధర్మంగా భావిస్తున్నాను.
విజయవాడ నాస్తిక సమాజం సం చాలకులు డా॥విజయం, నిర్వాహకులు డా॥సమరం నన్ను 2013 జూలైలో పిలి పించారు. ఆగస్టు 19 నుంచి 23 వరకూ బెంగళూరులో కర్ణాటక రాజ్య పరిషత్ నిర్వహిస్తున్న అడ్వాన్స్ లెవెల్ నేషనల్ వర్క్‌షాప్ అన్ డెవలప్ మెంట్ అండ్ డెమిస్టిఫికేషన్ ఆఫ్ మిరాకిల్స్‌కు హాజ రు కావాలని కోరారు. అప్పటికే మూఢనమ్మకాలను బహిర్గతపరిచే లక్ష్యంతో నేను ప్రదర్శిస్తున్న ఇంద్ర జాల ప్రదర్శనలను విజయవాడ నాస్తిక కేంద్రం ఆద రించి ప్రోత్సహిస్తూ ఉండేది. వారి సూచన ప్రకారం బెంగళూరులో ఐదు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్నా ను. దానికి సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి ప్రతిని ధులు హాజరయ్యారు.
మన తెలుగు సీమ నుంచి నేనొక్కడినే హాజర య్యాను. అందులో నేను గంటకు పైగా మ్యాజిక్ ప్రదర్శన చేస్తూ మూఢనమ్మకాలను బహి ర్గత పరుస్తూ ఇచ్చాను. ఐదు రోజుల పాటు ఆ వర్క్‌షాప్‌లో కల్బుర్గి చాలా క్రియాశీలక పాత్రను పోషించారు. ఆయ న చేసిన సుదీర్ఘ ప్రసంగం బాగా రక్తిక ట్టించింది. భాషా సమస్య వల్ల నాకు పూర్తిగా బోధపడకపోయినా, ప్రేక్షకుల నుంచి తన ప్రసంగానికి లభించిన ఆదరణను గ్రహించగలిగాను. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారి మనస్సులలో కల్బుర్గికి ప్రత్యేక స్థానం ఏర్ప డింది. అందుకు ఆయన గుణగణాలే కారణం. అం దరితో కలసి మెలసి తిరిగిన ఆయన రూపం ఇప్ప టికీ నా మనస్సులో మెదులుతూనే ఉంది.
మేం వర్క్‌షాప్‌లో ఉండగానే మహారాష్ట్రకు చెం దిన ప్రముఖ హేతువాద ఉద్యమకారుడు నరేంద్ర దభోల్కర్ హత్య జరిగిన వార్త (20-08-2013) తెలిసింది. వెంటనే సభ మౌనం పాటించింది. చివరి రోజు (23వ తేదీ) అక్కడికి సుమారు కి.మీ. దూరా న గల ఒక చౌరస్తాలో దభోల్కర్ హత్యకు నిరసనగా జరిగిన ధర్నాలో మేమందరం పాల్గొన్నాం. అం దులో కూడా కల్బుర్గి క్రియాశీల పాత్ర నేటికీ గుర్తే. దభోల్కర్ సంతాప సభలో పాల్గొన్న కల్బుర్గికి రెం డేళ్లు తిరిగే సరికి సంతాప సభలను నిర్వహించే దురదృష్టకర పరిస్థితి వచ్చింది. ఇది నాతో సహా ఆనాటి ధర్నాలో పాల్గొన్న ఎవరినైనా కంట తడిపెట్టి స్తుందనుకుంటాను.
దభోల్కర్, పన్సారే, కల్బుర్గీలను హిందూ మతోన్మాదశక్తులు హత్య చేయడాన్ని సాధారణ హిం దువులెవరూ బలపరచరు. ఈ ముగ్గురూ శాంతికా ముకులే. నమ్మిన ఆశయాలకు కట్టుబడ్డవారే. అయి నా రాజ్యాంగేతర హింసాత్మక శక్తుల ఎన్‌కౌంటర్‌కు ఈ ముగ్గురు శాంతి కాముకులూ బలయ్యారు.
ఈ పరిస్థితి పునరావృతం కాకుండా తెలుగుసీమలో కూడా ప్రజాతంత్ర, లౌకిక ఉద్యమాన్ని నిర్మించడం మనందరి కర్తవ్యం కావాలి. మూఢనమ్మకాల వ్యతి రేక లక్ష్యంతో ముప్ఫై ఏళ్లు తెలుగు సీమలో విస్తృతం గా మ్యాజిక్ ప్రదర్శనలిచ్చిన హేతువాదిగా, భౌతిక వాదిగా, ఇంద్రజాలకునిగా ప్రజలకు ఈ విజ్ఞప్తి చేస్తు న్నాను. కల్బుర్గికి నా కన్నీటి నివాళులివే.
వ్యాసకర్త మెజీషియన్, విజయవాడ
మొబైల్: 92901 78614
- కె. గౌతమ్