పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి | Police involved in social programs | Sakshi
Sakshi News home page

పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి

Published Thu, Feb 18 2016 1:24 AM | Last Updated on Mon, Oct 22 2018 7:26 PM

పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి - Sakshi

పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి

ప్రధాని మోదీ పిలుపు
మోదీ సూచనలపై బ్లూప్రింట్ రూపకల్పన

 
 న్యూఢిల్లీ: దేశంలోని పోలీసులు పల్స్ పోలియో లాంటి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈమేరకు ఇటీవల గుజరాత్‌లో పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన డీజీపీలు, ఐజీల సదస్సులో మోదీ చర్చించిన విషయాలపై తాజాగా బ్లూప్రింట్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఆయా విభాగాలు తయారుచేసిన బ్లూప్రింట్ ప్రకారం పోలీసులు, సాయుధ బలగాలు పనిచేయడం ప్రారంభించాయి. వారి ఠాణా పరిధిలో పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించడం, పాఠశాలలు, కళాశాలల్లో మెరిట్ విద్యార్థులను, వక్తృత్వ పోటీల్లో విజేతలను పోలీసు మెమెంటోలతో అభినందించడం లాంటి కార్యక్రమాలను నిర్వహించాలని మోదీ పేర్కొన్నారు. ట్వీటర్, ఫేస్‌బుక్ ఖాతాలను తెరిచి  వదంతులను అరికట్టేందుకు కృషిచేయాలన్నారు.

 రాష్ట్రానికో ‘ఐకాన్’ రైల్వేస్టేషన్
 ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్క రైల్వే స్టేషన్‌ను అయినా.. దానికి ఒక విశిష్ట నిర్మాణం (ఐకాన్)గా, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా రూపొందించేలా అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. ఢిల్లీలో ప్రగతి (క్రియాశీల పరిపాలన, సమయానికి అమలు) సమావేశంలో రాష్ట్రాల్లో కొనసాగుతున్న రోడ్డు, రైల్వే,విద్యుత్ పలు మౌలిక ప్రాజెక్టులపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement