సామాజిక న్యాయం తుంగలో..
Published Sun, Feb 5 2017 10:46 PM | Last Updated on Mon, Oct 22 2018 7:27 PM
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్
మాచర్లః ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ప్రజా చైతన్య యాత్ర జిల్లా కన్వీనర్ జంగాల అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పార్టీ ఏరియా కార్యదర్శి బాలస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ఆధిపత్య కులాలు, సంపన్న వర్గాలు అభివృద్ధి చెందే విధంగా పాలక వర్గాలు పరిపాలన చేస్తున్నాయని విమర్శించారు. ఉత్పత్తి కులాలు తమ జీవితాలను యంత్రాలకు ధారపోస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పాటుపడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న టీడీపీ పాలన చూస్తే శవాలపై చిల్లర ఎత్తుకున్నట్లు ఉందని వైఎస్సార్ సీపీ గిరిజన విభాగ ప్రధాన కార్యదర్శి హనుమంతూనాయక్ విమర్శించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జెట్టిపాలెం వెంకటేష్, బీసీ సంక్షేమ సం«ఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల నాగేశ్వరరావుయాదవ్, నియోజక వర్గ యాదవ్ మహాసభ నాయకుడు ముళ్ల శ్రీనివాస్‌యాదవ్, బార్ అసోసియేషన్ నాయకులు జి.వెంకటేశ్వర్లుయాదవ్, జిల్లా సీపీఐ సభ్యులు గురజాల హుస్సేన్, బండారు శ్రీనివాసరావు, అబ్రహాంలింకన్, మాచర్ల రూబేన్, టి.బాబు, వెంకటేశ్వర్లు, షేక్ షైదా, బాబురావు, నాగేంద్రం బాషా, గాజుల చెన్నయ్య, మందాసంతోష్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయా సామాజిక వర్గాల సంఘ నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement