అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీ వైఖరిని నిరసిస్తూ కనగానిపల్లిలోని 50 కుటుంబాలవారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ కండువా వేసి పార్టీలోకి వారిని ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ విభజనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు.
చంద్రబాబు నాయు డు కూడా తెలంగాణ కు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల చేతుల్లో పెట్టారన్నారు. రెండు పార్టీల వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీని ఏపీఎన్‌జీఓలు, ఆర్టీసీ జేఏసీ, వైద్య, ఆరోగ్య జేఏసీ, కార్మికులు, రైతులు, మహిళలు స్వాగతిస్తున్నారన్నారు. చంద్రబాబుకు వైఎస్ జగన్ ఫోబియా పట్టుకుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చేతులు కలిపి జగన్‌కు బెయిల్ రాకుండా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. పార్టీ జిల్లా ముఖ్యనేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయంతో సీమాంధ్ర అగ్నిగుండంలా మారిందన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్, టీడీపీలు అడ్రస్ లేకుండా పోతాయన్నారు. పార్టీలో చేరిన వారిలో వై జయప్ప, పీ ఉజ్జన్న, బీ ఉజ్జినప్ప, కే సంగాలప్ప, వైసీ ముత్యాలప్ప, పీసీ ముత్యాలప్ప, పీపీ ముత్యాలప్ప, పామల గోవిందరాజు, మలగవేలు నారప్ప, బీ వీరనారప్ప, అంకె రామాంజినేయులు, మిడతల పెద్దయ్య, కరణం జగన్నాథ రావు, మిడతల బాలవీరన్న, పూజారి సుబ్బరాయుడు, ఉలిగొండ ఈశ్వరయ్య, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, మిద్దె భాస్కర్ రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, లింగాల రమేష్, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, పూలకుంట శివారెడ్డి, దిలీప్ రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కసనూరు రఘునాథ్‌రెడ్డి, మధు, పూలకుంట భాస్కర్‌రెడ్డి, జయరాం నాయక్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, హజరాంబి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన కనగానపల్లివాసులు
Published Sun, Sep 15 2013 4:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement