
కాంట్రాక్టు లెక్చరర్ల పక్షాన పోరాటం
అనంతపురం రూరల్ : కాంట్రాక్టు లెక్చరర్ల పక్షాన ప్రభుత్వంపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ హామీ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ తెచ్చిందే తానని, అధికారం చేపట్టగానే క్రమబద్దీకరిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో గద్దెనెక్కిన బాబు ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్లు కావస్తున్నా మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్పొరేట్ దిగ్గజాల సంస్థల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చేసింది శూన్యమన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా బాబుకు బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియ¯ŒS నాయకులు ఆదినారాయణరెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు చింతా సోమశేఖర్‌రెడ్డి, పార్వతి, ఐద్వా సంఘం నాయకులు సావిత్రి, దిల్షాద్ తదితరులు పాల్గొన్నారు.