అపర భగీరథుడు వైఎస్‌ఆర్‌: శంకర్‌ నారాయణ | shankarnarayana praises YSR | Sakshi
Sakshi News home page

అపర భగీరథుడు వైఎస్‌ఆర్‌: శంకర్‌ నారాయణ

Published Sat, Jul 8 2017 5:24 PM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

అపర భగీరథుడు వైఎస్‌ఆర్‌: శంకర్‌ నారాయణ - Sakshi

అపర భగీరథుడు వైఎస్‌ఆర్‌: శంకర్‌ నారాయణ

గుంటూరు: అపర భగీరథుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో హంద్రీనీవా పథకాన్ని చేపట్టి అనంతపురం జిల్లాకు నీళ్లు ఇచ్చారని, జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని వైఎస్‌ఆర్‌ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ కొనియాడారు. అనంతపురం జిల్లా సమస్యలపై ఆయన వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

'అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్‌ఆర్‌ హంద్రీనీవా పథకానికి రూపకల్పన చేసినవిధంగానే డిస్టిబ్యూటరీల ద్వారా జిల్లాకు నీళ్లు ఇవ్వాలి. అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు 21 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేర్చాలి. ప్రతి ఏడాది జిల్లాలో కరువు, కాటకాలు ఏర్పడుతున్నాయి. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి' అని శంకర్‌నారాయణ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement