బాబు నాటకాలను ఎండగడదాం | Games of babu | Sakshi
Sakshi News home page

బాబు నాటకాలను ఎండగడదాం

Published Thu, Dec 4 2014 2:44 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

Games of babu

 పెనుకొండ :  ‘ఎన్నికలకు ముందు  రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత రుణాలు రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు. బాబు నాటకాలను ఎండగడదాం. 5వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాకు తరలిరండి’ అంటూ వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి పెనుకొండలో సుమారు 200 ద్విచక్రవాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రుణమాఫీ చేయని చంద్రబాబు వెంటనే గద్దెదిగాలి’ అంటూ నినాదాలు చేశారు.
 
 అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను శంకరనారాయణ పంచుతూ ధర్నాకు రావాలని కోరారు. దర్గా సర్కిల్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రుణాల మాఫీ ఫైలుపై చంద్రబాబు సంతకం చేసినా అమలు మాత్రం కావడం లేదన్నారు. నేడూ, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పంట రుణాలు కూడా రెన్యూవల్ చేయకపోవడంతో రానున్న రోజులు రైతులకు మరింత ఆందోళనకరంగా ఉంటాయన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీలకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 20 శాతం జమ చేస్తామని చెబుతున్నా రైతులు నమ్మేస్థితిలో లేరన్నారు. రాజధాని పేరుతో సింగపూర్, జపాన్ అంటూ విదేశాలకు వెళ్లడం సీఎంతో పాటు మంత్రులకు అలవాటుగా మారిపోయిందన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూనే విరాళాలు ఇవ్వాలని అర్థించడం ఏ మాత్రం సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై ఇప్పటికే రైతుల్లో ఏవగింపు కలిగిందన్నారు. బాబు సీఎం అయ్యాక రైతులు బీమా కోల్పోయారని, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయని, పింఛన్‌లు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, పేదల రేషన్ కార్డులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపులు రద్దంటూనే లెసైన్స్ బెల్ట్ షాపులు తెచ్చారన్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 5న జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
 కార్యక్రమంలో కన్వీనర్ వెంకటరామిరెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, సానిపల్లి మహీధర్,  ఎంపీటీసీ సభ్యులు  రామ్మోహన్‌రెడ్డి, రహంతుల్లా, ఉమర్ ఫారూక్, మురళి, గుట్టూరు శ్రీరాములు, కే.రమేష్‌బాబు,  సర్పంచ్‌లు శ్రీకాంతరెడ్డి, సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాల్‌రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, యస్‌బి.శీనా, ఇలియాజ్, ఇర్షాద్, బోయ నరసింహ, మునిమడుగు శ్రీనివాసులు, శ్యాం నాయక్, గౌస్‌లాజం, సోమశేఖరరెడ్డి, కొండలరాయుడు, జాఫర్,  వెంకటేశు, నాయుడు, రత్నాలు, జయచంద్రారెడ్డి, మొబైల్స్ ఫణి, అంజేనాయక్, ఆదినారాయణరెడ్డి, మదన్, రామచంద్రరెడ్డి, సదాశివరెడ్డి, బోయబాబు,  సి.శ్రీరాములు,  రామాంజినేయులు, రవి, వెంకటేష్, శంకర్, ఆదిశేషు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.   
 
 డ్వాక్రా సంఘాల సభ్యులు తరలిరండి
 ఉరవకొండ : కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులు తరలిరావాలని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబును నమ్మి మహిళలు మోసపోయారన్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మెత్తం వూఫీ చేస్తావుని హమీ ఇచ్చి, ప్రస్తుతం సంఘానికి రూ.10 వేలు వూత్రమే చెల్లిస్తావుని చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం జిల్లాలో 90 శాతం సంఘాలు డీఫాల్డ్‌గా మిగిలి పోనున్నాయుని, పేద వుహిళలలు తిరిగి రుణాలు కట్టే దుస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు.   
 
 ‘తొలి సంతకానికే విలువ లేదు’
 కదిరి :  ‘రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి..బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు బయటకు రావాలంటే బాబు రావాలి..జాబుకావాలంటే బాబు రావాలి..ఇలా టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఊదరగొట్టారు. గోడలమీద తాటి కాయంత అక్షరాలతో రాయించుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయింది. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఆయన ప్రమాణ స్వీకారం రోజు చేసిన తొలి సంతకానికే విలువ లేకుండా పోయింది. తొలి సంతకం అంటే ఏంటో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒక సారి గుర్తు చేసుకో’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
  రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు సవా లక్ష నిబంధనలు పెడుతూ రైతులను ఏడ్పిస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని విమర్శించారు. ‘నిరుద్యోగులకు రూ 2 వేలు చొప్పున నిరుద్యోగభృతి అని చెప్పి ఓట్లు వేయించుకున్నావ్..ఎవరికిచ్చావు? ఎక్కడిచ్చావ్ ?’ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలంటూ ఈ నెల 5న (రేపు) కలెక్టరేట్ ముందు తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వజ్ర భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు జగన్, శివశంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement