రాష్ట్రంలో రౌడీ రాజ్యం | shankarnarayana fires kesineni nani and bonda uma | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రౌడీ రాజ్యం

Published Mon, Mar 27 2017 12:08 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

రాష్ట్రంలో రౌడీ రాజ్యం - Sakshi

రాష్ట్రంలో రౌడీ రాజ్యం

= అధికారులపై తమ్ముళ్ల దౌర్జన్యాలు తగదు
= కేశినేని, బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలి
= వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ

సోమందేపల్లి : రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ అన్నారు. అధికారులపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల దాడులు చేయడం సిగ్గు చేటన్నారు. ఆదివారం ఆయన పరిగిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం విజయవాడలో ఆర్టీఏ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రమణ్యంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. అధికారికి రక్షణగా ఉన్న గ¯ŒSమెన్లపై కూడా చేయి చేసుకోవడం టీడీపీ ప్రజాప్రతినిధుల గుండాగిరికి నిదర్శనమని దుయ్యబట్టారు.

గతంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక విషయంలో మహిళా తహసీల్దార్‌ వనజాక్షిపై చేయి చేసుకున్నప్పుడే మఖ్యమంత్రి  చంద్రబాబు స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేయించి ఉంటే టీడీపీ నాయకుల ఆగడాలు మితివీురేవి కావన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు వారి పనులను స్వేచ్ఛగా చేయలేకపోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేశినేని నానిపై సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పరిగి మండల వైఎస్సార్‌సీపీ నాయకులు జయరాం, రమణ, మారుతీశ్వర్‌రావు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement