ఎర్రగుంట్ల: సాక్షర భారత్ నిధులు స్వాహా చేసిన సంఘటనకు సంబంధించి సాక్షర భారత్ డిప్యూటీ డెరైక్టర్ సత్యనారాయణ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల ఎంపీడీఓ జయసింహ, మండల సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ శంక రనారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.
మండలంలోని సాక్షర భారత్ నిధులు సుమారు 19 లక్షల 35 వేల 480 రూపాయలను స్వాహా చేసినట్లు సాక్షర భారత్ డీడీ సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ జయసింహ, కో-ఆర్డినేటర్ శంకర్‌నారాయణలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎర్రగుంట్ల ఎంపీడీఓపై క్రిమినల్ కేసు
Published Sun, Sep 7 2014 2:04 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement
Advertisement