valmiki jayanthi
-
వాల్మీకి మహర్షికి సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ పాల్గొన్నారు. -
‘బీసీలకు శాశ్వత కమిషన్ వేసింది ఏపీ ఒక్కటే’
సాక్షి, శ్రీకాకుళం : దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్ వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన కృష్ణదాస్ జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయణ సామాజిక నీతిని బోధిస్తుందని, భారత లౌక్యం నేర్పిస్తుందని అన్నారు. బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అని స్పీకర్ తెలిపారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఒక బోయవాడు పరిణితి చెంది అద్భుతమైన రామాయణ కావ్యం రాశారని గుర్తు చేశారు. బీసీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో పథకాలను అందించారని, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత పాధాన్యత ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు. -
ఏపీలో ఘనంగా వాల్మీకీ జయంతి వేడుకలు
సాక్షి, విశాఖపట్నం : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాల్మీకీ చిత్ర పటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకుల పెద్దెత్తున పాల్గొన్నారు. కృష్ణా : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంజరావు, మండల పార్టీ కన్వీనర్ శీలం నాగనర్సిరెడ్డి,చలమాల సత్యనారాయణ,కలకొండ రవికుమార్ పాల్గొన్నారు. అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన వాల్మీకీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు . రామగిరి మండలం, నసనకోట గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి సోదరులు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ : కడప జిల్లా వ్యాప్తంగా వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ట్రాఫిక్ స్టేషన్ ఎదురుగా ఉన్న వాల్మీకి విగ్రహానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇతర అధికారులు.రాజంపేట మండలం బోయపాలెంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసుల రెడ్డి, ఆర్.డి.ఓ ధర్మ చంద్రా రెడ్డి పాల్గొన్నారు. -
అనంతపురం వేదికగా నేడు వాల్మీకి జయంతి వేడుకలు
-
రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి
సాక్షి, అమరావతి: అక్టోబర్ 13న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి రోజున నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వాల్మీకి జయంతి నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలకు రూ.25 లక్షల నిధులు విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి జయంతిని అనంతపురం జిల్లాలో రాష్ట్ర్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. వాల్మీకి జయంతి నిర్వహణకు అనంతపురం జిల్లాకు రూ.6 లక్షలను కేటాయించింది. మిలిగిన 12 జిల్లాలకు రూ.లక్షన్నర చొప్పున నిధులను ప్రభుత్వం కేటాయించింది. -
బోయ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తాం
విజయవాడ (భవానీపురం): బోయల సంక్షేమానికి రూ.48 కోట్లతో బోయ ఫెడరేషన్తో పాటు దానికి పాలకవర్గాన్నికూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని బీసీ, ఎక్సైజ్, చేనేత మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బీసీ శాఖ ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మహర్షి వాల్మీకీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఆశ్వీయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామన్నారు. బీసీ వర్గాల్లోని యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ పరిశ్రమల పార్క్ ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి 5వేల ఏళ్ల క్రితమే రామాయణ మహాకావ్యాన్ని రచించారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని చదువు ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరామ్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, వాల్మీకి బోయ సంక్షేమ సంఘం కన్వీనర్ ఎమ్ జగదీష్, వాల్మీకి బోయ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సీహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.