
సాక్షి, శ్రీకాకుళం : దేశంలోనే బీసీలకు శాశ్వత కమిషన్ వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం పేర్కొన్నారు. ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన కృష్ణదాస్ జయంతి వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయణ సామాజిక నీతిని బోధిస్తుందని, భారత లౌక్యం నేర్పిస్తుందని అన్నారు. బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ అని స్పీకర్ తెలిపారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఒక బోయవాడు పరిణితి చెంది అద్భుతమైన రామాయణ కావ్యం రాశారని గుర్తు చేశారు. బీసీల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో పథకాలను అందించారని, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం అత్యంత పాధాన్యత ఇచ్చిందని మంత్రి ధర్మాన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment